ఓ ఆటోలో ముగ్గురు తాగుబోతులు.. నిర్మాణుష్య ప్రాంతం.. కల్లు తాగిన వివాహిత.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana Crime News: ఇటీవల ఇంటి వద్ద దింపుతామని ఆటోలో తీసుకువెళ్ళి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  రంగారెడ్డి(Ranjareddy)జిల్లా రాజేంద్రనగర్‌(Rajender Nagar)లో మూడు రోజుల కిందట దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ మహిళను(Women) ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఈ ఘటనలో లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

  Shocking Incident: ఆ మహిళ ఆటో కోసం ఎదురు చూస్తోంది.. గమనించిన ముగ్గురు తాగుబోతులు ఆమెను.. బలవంతంగా..


  పోలీసులు నిందితుల వద్ద నుంచి ఆటోతో పాటు బాధితురాలి సెల్‌ఫోన్, రోల్డ్‌ గోల్డ్‌ చైన్, పర్సును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను స్థానిక ఎస్సై కనకయ్య తెలిపాడు. హైదరాబాద్ లోని పురానాపూల్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వివాహిత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమె డ్యూటీ అయిపోయిన తర్వాత కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో ఓ రోజు హైదర్ గూడలోని కల్లు కంపౌండ్ కు వచ్చి కల్లు తాగి ఇంటికి తిరిగి వెళ్లింది. మరుసటి రోజు ఇలానే ఆమె హైదర్ గూడ కల్లు తాగేందుకు వచ్చింది. ఇదే సమయంలో కూకట్ పల్లికి చెందిన వివేక్ నగర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగ్ రావు (32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్‌(31), బాలానగర్‌కు చెందిన ప్రసాద్‌(35) లు హైదర్ గూడకు వచ్చారు.

  ఆ బాలికకు 12 ఏళ్లు.. అతడి ఇంటి పక్కనే ఉంటుంది.. సమయం కోసం చూసి ఆ ఇంట్లోకి దూరాడు.. చివరకు..


  అదే కల్లు కాంపౌండ్ కు వచ్చారు. ఈ ముగ్గురు మహిళలు ఆమెతో మాటలు కలిపారు. తాము కూడా ఆటోలో పురానాపూల్ వెళ్తున్నామని.. ఆటో లో ఎక్కించుకున్నారు. ఇలా ఇంటివద్ద దింపుతామని నమ్మించారు. అత్తాపూర్ నుంచి రాజేంద్ర నగర్ వైపు ఆటోను మళ్లించడంతో ఆ మహిళ ఎక్కడకు తీసుకువెళ్తున్నారని అడగడంతో హోటల్‌లో బిర్యానీ తిని వెళదామని తెలిపారు. ఇక ఆమె మద్యం మత్తులో ఉండటంతో వాళ్లు ఏం చేస్తున్నారో ఆమె గమనించలేక పోయింది. బిర్యానీ తిని అక్కడ నుంచి హిమాయత్ సాగర్ లోని లార్డ్స్ కాలేజీ వెనుక పక్కకు వెళ్లారు. అక్కడన నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు.

  భార్యపై సీక్రెట్ గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.. చివరకు అందులో రికార్డయిన దృశ్యాలను చూసిన భర్త..


  అనంతరం బాధితురాలి సెల్‌ఫోన్, మెడలోని రోల్డ్‌ గోల్డ్‌ చైన్, పర్సును తీసుకోని ఆటోలో పరారయ్యారు. అర్థరాత్రి సమయంలో ఆమె స్థానికుల సహాయంతో రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కల్లు కంపౌండ్‌తో పాటు ప్రధాన రహదారులు, హోటల్, హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆటో నెంబర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ నిమిత్తం వాళ్లా ఈ నేరాన్ని ఒప్పుకోవడంతో వాళ్లను రిమాండ్ కు పంపించారు పోలీసులు.
  Published by:Veera Babu
  First published: