Shocking Incident: ఆ మహిళ ఆటో కోసం ఎదురు చూస్తోంది.. గమనించిన ముగ్గురు తాగుబోతులు ఆమెను.. బలవంతంగా..

ప్రతీకాత్మక చిత్రం

Shocking Incident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు (Murder), అత్యాచారాలు (Rape) ఆగడం లేదు. నిర్భయ(Nirbhaya), దిశ(Disha) లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర (Central) మరియు రాష్ట్ర(State) ప్రభుత్వం(Government) ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.

  Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..


  ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై(Minor Girls) అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి(Ranjareddy) జిల్లా రాజేంద్రనగర్‌(Rajender Nagar)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ మహిళను(Women) ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  Shocking Incident: చెప్పేవి నీతులు.. చేసివి నీచపనులు.. అక్కాచెల్లెళ్లు ఉన్న ఇంటికి వెళ్లి ఈ కానిస్టేబుల్..


  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఓ ముగ్గురు యువకులు మద్యం సేవించి ఉన్నారు. అక్కడే ఓ 25 సంవత్సరాల మహిళ ఆటో కోసం ఎదురుచూస్తోది. ఫుల్ గా మద్యం సేవించిన ఆ మగ్గురు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. ఆమె చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లకుండా అక్కడ నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్తుండగా ఆమె అరిచింది. కానీ అందులో ఉన్న వాళ్లు ఆమె నోటిని బలవంతగా పట్టుకున్నారు.

  Cab Driver: క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. కోపంతో ఆ డ్రైవర్ ఏ చేశాడో తెలుసా..


  దీంతో కామ్ గా ఆ ఆటోను నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ అమ్మాయికి బలవంతంగా  మద్యం తాపించి.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ సమీపంలో చోటు చేసుకుంది. బాధిత యువతి అక్కడ నుంచి వెళ్లి తన కుటుంబ సభ్యులు చెప్పింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా బాధితులను గుర్తించే పనిలో ఉన్నారు.

  School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..


  నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
  Published by:Veera Babu
  First published: