Home /News /telangana /

HYDERABAD WOMAN KILLED HER 3 YEARS OLD SON WITH HELP OF LOVER IN HYDERABAD SU

Hyderabad: వదిన అంటూ దగ్గరయి.. మహిళతో వివాహేతర సంబంధం.. వీరిద్దరు కలిసి ఎంత నీచమైన పని చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ వదిన అంటూ దగ్గరైన వ్యక్తి మాయలో పడి.. అతనితో వివాహేతర సంబందం పెట్టుకుంది.

    ఓ మూడేళ్ల బాలుడి హత్య కేసు విచారించిన పోలీసులు.. అసలు నిజాలను వెలికి తీశారు. బాలుడి హత్య జరిగిన తీరు తెలుసుకుని పోలీసులే చలించిపోయారు. తల్లి వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తేల్చారు. తల్లి ప్రియుడు విచక్షణ రహితంగా బాలుడిని కొట్టి చంపినట్టు నిర్దారించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ, జగద్గిరిగుట్టకు చెందిన సురేశ్‌లు కొన్నేళ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు ప్రస్తుతం జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇక, సురేశ్‌కు కర్ణాటకకు చెందిన భాస్కర్ పరిచయమయ్యాడు. అన్న, వదిన అని పిలుస్తూ సురేశ్, ఉదయలకు దగ్గరయ్యాడు.

    ఈ క్రమంలోనే భాస్కర్‌.. సురేశ్‌ను తన వద్ద పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత సురేశ్ భార్య ఉదయ్‌తో భాస్కర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సురేశ్‌ను బయటకు పంపి ఆమెతో గడిపేవాడు. ఓ రోజు భాస్కర్, ఉదయలు ఏకాంతంగా ఉండటం సురేశ్ చూశాడు. దీనిపై భార్యతో గొడవపడ్డాడు. అయితే భర్త తనతో గొడవకు దిగడంతో ఉదయ.. తను కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

    కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?

    ఆ పాకిస్తానీ కుటుంబం కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు కారణమం ఏమిటంటే..?

    ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉదయ.. చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌లో అద్దెకు ఉంటోంది. భాస్కర్‌తో సంబంధానికి బాబు అడ్డంగా ఉన్నాడని వదిలించుకొనేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే గత మంగళవారం అన్నం తినకపోవడంతో బాలుడిని ఓ దెబ్బ కొట్టింది. ఇదే అదనుగా తీసుకున్న ఆమె ప్రియుడు భాస్కర్.. పిల్లాడిని వైరుతో తీవ్రంగా కొట్టాడు. విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. ప్రాణం పోయేదాకా కొట్టాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిజాలను వెలికితీశారు. బాలుడి హత్య చేసిన తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Hyderabad, Illicit affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు