Medak : మాతృత్వం మంటకలసి పోయో సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది...సులభ్ కాంప్లెక్స్‌లో ఓ బిడ్డకు జన్మనించిన తల్లీ..ఆ బిడ్డను లోకం చూడకుండా బాత్రూం కిటికిలో నుండి బయటకు వేసిన దయనీయ ఘటన నారాయణఖేడ్ మండలంలో చోటు చేసుకుంది.
ఆర్థిక అవసరాలు తీరలేక.. నా అనేవారు ఎవరు లేకపోవడం,కుటుంబ బంధావ్యాలు మచ్చుకు కూడా కానరాకపోవడం... వెరసి ఎవరు లేకున్నా మేమున్నామంటూ భరోసా కల్పించే ప్రభుత్వ యంత్రాంగం, రాజ్య వ్యవస్థలు లేకపోవడంతో అనేక దారుణాలకు నవ సమాజం సాక్షిభూతంగా నిలుస్తోంది..ఈ పరిస్థితుల నడుమ మానవ ధర్మానికి విరుధ్దంగా కొంతమంది తల్లులు వ్యవహరిస్తు భవిష్యత్ తరాలకు తలవంపులు తెస్తున్న సంఘటనలు కొకల్లుగా చోటు చేసుకుంటున్నాయి.. తాము ఎలా పుట్టి పెరిగామో తమ కన్న పిల్లలకు ఆ పరిస్థితిని రానీయకూడదనే ధోరణి lనేటి సమాజంలో కనిపిస్తోంది..దీంతో సమాజంలో మానవ బంధాలకంటే ఆర్ధిక బంధాలే ఎక్కువగా డామినెట్ చేస్తున్న తరుణంలో ఓ తల్లి పురిటిలోనే తన కన్నపేగును తుప్పల్లో పడేసేందుకు సిద్దమైంది...అయితే అదృష్టవశాత్తు ఇతరుల కంటపడడంతో ఆ పసికూన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పఠాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. నారాయణఖేడ్ మండలం రాయలమడుగుకు చెందిన నాగేష్, మెగావత్ బూలిలు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించడానికి బీరంగూడలో నివసిస్తున్నారు...కాగా రెండు నెలల క్రితం భర్త నాగేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు..అయితే బూలి అప్పటికే గర్భవతిగా ఉండటంతో ఇటివల నెలలు నిండాయి. ఈ క్రమంలోనే ..శనివారం మధ్యాహ్నం సమయంలో లింగంపల్లి చౌరస్తాలో గల జహీరాబాద్ బస్టాపులోని సులభ్ కాంప్లెక్స్‌లోకి లాట్రిన్లోకి వెళ్లింది.. అందులోనే ప్రసవించింది.. .అయితే అందులోకి వెళ్లిన బూలి రెండు గంటలయినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు బలవంతంగా తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు...
అయితే.. అప్పటికే ఆమెకు ప్రసవం జరగడంతో వెంటనే పుట్టిన సిగుడ్డును కిటికీలోంచి బయటకు పడేసే ప్రయత్నం చేసింది. దీంతో వారించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాడు.. ఆతర్వాత పోలీసులు వచ్చిపుట్టిన పసిబిడ్డను పఠాన్‌చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆసుపత్రిలో కూడా తన బిడ్డను.. బూలి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సంగారెడ్డి ఐసీడీఎస్ అధికారులకు తల్లిబిడ్డలను అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.