Banjara hills : భర్త ముందు ఫ్యాషన్ షో చేయ్..! లేదంటే వేధింపులు.. విసిగిపోయి.. చివరకు ..?

ప్రతీకాత్మక చిత్రం

Banjara hills : ఆమె చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ అయినా ఆ.. అమ్మాయి .. భర్త, అత్తమామలు చెప్పినట్టు ఇంట్లోనే భర్త ముందు వయ్యారాలు ఒలకబోయాలట.. ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులు వేసుకుని కేవలం భర్త ముందు మాత్రమే తిరగడంతో పాటు భర్త చెప్పినట్టు వినాలంటూ ఓ భార్యకు వేధింపులు ఎక్కువయ్యాయి.

 • Share this:
  పెళ్లికి ముందు ఆమె చేసిన ఫ్యాషన్ డిజైనింగ్(Fasion desiner) తోపాటు ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా నచ్చడంతో పెళ్లి చేసకున్నాడు. కాని పెళ్లి(Marriage) తర్వాత ఎందుకో ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలని భర్త వేధింపులు మొదలు పెట్టాడు.. చదువు మానేసి ఇంట్లో కూర్చుని వంట పని నేర్చుకుంటూ అత్తామామల సూటిపోటి మాటలు.. ఇలా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తతో పాటు అత్తామామలపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ బంజారాహిల్స్‌ (Banjarahills)పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.11లో నివాసముండే యువతి ఎంబీఏ పూర్తి చేసింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరి నేర్చుకుంటుంది.. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని(Secundrabad) గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న మహ్మద్‌ ఫర్హాన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా పెళ్లివరకు వెళ్లింది.. ఇరు వర్గాల సమ్మతితో పెండ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు ఖరీదైన బహుమతులు అందజేశారు.

  ఇది చదవండి : ప్రియున్ని స్కూల్‌కే పిలుపించుకున్న ప్రైవేట్ టీచర్.. రెడ్ హ్యండెడ్‌గా దొరకబట్టిన భర్త .. ఆ తర్వాత..?


  ఇక అప్పుడే ప్రారంభం అయింది అసలు కథ.. పెళ్లికి ముందు ఒక ఆలోచన పెండ్లి తర్వాత మరో ఆలోచన భర్తలో మొదలైంది. పెళ్లి అయిన తర్వాత చదువు మానేసి ఇంట్లో ఉండాలని అత్తామామలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీనికి తోడు చిన్న చిన్న దుస్తులు వేసుకోవాలని, లోదుస్తులతో తన ముందు నడవాలంటూ.. వాటిని ఫొటోలు, వీడియోలు (photos)తీసుకోవడం చేస్తున్న భర్త ఫర్హాన్‌ తీరుపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసేది. అయితే తాను చెప్పినట్లు వినకపోతే తీసిన వీడియోలు సోషల్‌మీడియాలో(social media) పోస్ట్‌ చేస్తానని తరుచూ బెదిరిస్తున్నాడు.

   ఇది చదవండి : బడిలోకి గుంజుకుపోయి బలత్కారం.. సూర్యాపేట‌లో దారుణం


  మరోవైపు ఆమె ఖరీదైన ఆభరణాలు మొత్తం అత్త అయేషా ఉస్మాన్‌ తన వద్ద పెట్టుకుంది. ఎప్పుడు అడిగినా లాకర్లో ఉన్నాయని, ఖరీదైన ఆభరణాలు వేసుకుని జనం దృష్టిలో పడవద్దంటూ చెప్పేది. రెండేళ్లయినా పిల్లలు కాకపోవడంపై సూటిపోటి మాటలతో వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 8న ఇంట్లోంచి వెళ్లేందుకు బాధితురాలు సిద్దపడింది.

  ఇది చదవండి : భర్తతో వీడియో కాల్ కట్ చేసింది, అంతే... రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది..!


  ఇందుకోసం ఆమె దాచుకున్న డబ్బులు సమారు రెండు లక్షలతోపాటు నగలు కూడా కనిపించలేదు.. దీంతో అత్తతోపాటు భర్త ఆగడాలపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులు ఫర్హాన్‌, అతడి తల్లి అయేషా ఉస్మాన్‌, మామ ఉస్మాన్‌పై గృహహింసతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  Published by:yveerash yveerash
  First published: