హోమ్ /వార్తలు /తెలంగాణ /

Woman Suicide : డబ్బు అప్పుగా తీసుకుంటే మహిళను ఆ విధంగా వేధిస్తారా .. భరించలేక ఏం చేసిందో తెలుసా

Woman Suicide : డబ్బు అప్పుగా తీసుకుంటే మహిళను ఆ విధంగా వేధిస్తారా .. భరించలేక ఏం చేసిందో తెలుసా

private finance harassment

private finance harassment

Woman Suicide: గ్రేటర్ హైదరాబాద్‌ శివారులో ఓ మహిళ వేధింపులు భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ సూసైడ్‌ లెటర్‌ రాసింది. అందులో తన చావుకు కారణం అని ఎవరు పేరు రాసిందంటే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రైవేట్ ఫైనాన్స్‌ సంస్థ(Private finance)ల వేధింపులు, ఆన్‌లైన్‌(Online Loan), లోన్‌యాప్(LoanApp)నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. ప్రజల అవసరాలను తెలుసుకొని రుణాలు ఇచ్చి ..వాటిని రికవరీ చేసుకునే క్రమంలో పీక్కు తింటున్నారనే విమర్శలు ఈమధ్య కాలంలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పుగా డబ్బులు తీసుకుంటే వసూలు చేయడం కోసం వాళ్ల పరువును, ఫ్యామిలీని బజారుకీడవటం భరించలేకపోతున్న బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌(Greater Hyderabad)శివారులో ఓ మహిళ ప్రైవేట్ ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుల వేధింపులు(Harassment)భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide)చేసుకుంది. చనిపోతూ సూసైడ్‌ లెటర్‌(Suicide letter)రాసింది. అందులోనే తన చావుకు కారణమైన వారి పేర్లను రాసింది మృతురాలు.


Hyderabad: క్లాస్ రూమ్ బయట నిలబెట్టారని మనస్థాపం.. ఉరేసుకొని 13 ఏళ్ల బాలిక మృతిమహిళ కాబట్టి భరించలేకపోయింది..
చిన్న చిన్న అవసరాలు, ఆర్దిక ఇబ్బందులతోనే మధ్య, చిన్న కుటుంబాలు అప్పులు చేయాల్సి వస్తుంది. ఈక్రమంలోనే మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ మండలం రాజబొల్లారం తండాకు చెందిన మాలోత్ సునీత అనే మహిళ కూడా ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ సంస్థ దగ్గర రుణం తీసుకుంది. అనుకోకుండా శుక్రవారం తన ఇంట్లో చీరతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్చుల సమాచారం మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గదిలో లభించిన సూసైడ్ లెటర్ ఆధారంగా సునీతను ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు వేధించడం వల్లే ప్రాణాలు తీసుకుంటున్నట్లుగా సూసైడ్‌ లెటర్‌లో పేర్కొంది.పరువు పోతుందనే భయంతో..

సునీత శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలో మల్టీ బ్రాండ్‌ పేరుతో బైక్‌ జోన్ షోరూం నడుపుతోంది. 20ఏళ్ల క్రితమే ఎస్‌ఆర్‌ నగర్‌కి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. ఓ కూతురు పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. గత పది సంవత్సరాలుగా సునీత మేడ్చల్ పట్టణం కేఎల్లార్‌ వెంచర్‌లో అద్దెకు నివసిస్తోంది.


సూసైడ్‌ లెటర్‌లో పేర్లు ..

మృతురాలి గదిలో లభించిన సూసైడ్‌ లెటర్‌లో ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్‌ దగ్గర డబ్బులు తీసుకున్నట్లుగా సునీత పేర్కొంది. అయితే వాటిని రికవరీ పేరుతో తనను వేధింపులకు గురి చేసినట్లుగా మృతురాలు లేఖలో పేర్కొంది. అంతే కాదు తన చావుకు పూరెల్లి ప్రభాకర్రెడ్డి ప్రధాన కారకుడు అని రాసింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

First published:

Tags: Greater hyderabad, Telangana News, Woman suicide

ఉత్తమ కథలు