హైదరాబాద్ రేపు మద్యం షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పాలక సంస్థ అధికారులు ఆదేశించారు. వైన్, కల్లు దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు, పబ్బులు, ఫైవ్‌స్టార్ హోటల్ బార్ రూమ్‌లకు వర్తించే ఆర్డర్ మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మార్చి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరిస్థితిని జాగ్రత్తగాచూసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రజలకు తెలియజేశారు. మద్యం అక్రమ విక్రయాలపై కూడా హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2010 నుంచి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. సీతారాంబాగ్లోని రామాలయం నుంచి కోఠి లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభా యాత్ర జరుగుతుంది. సీతారాం బాగ్ రామాలయంలో ఉదయం 9 గంటలకు నుంచి శ్రీరాముని కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణ అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
ఈ శోభా యాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరవుతారు. శోభా యాత్ర సీతారాంబాఘ్ నుంచి బోయగూడ కమాన్- మంగళహాట్ పీఎస్-పురానా పూల్-సిద్ధంబరు బజార్- గౌలిగూడ- పుత్లిబౌలి-కోఠి ఆంధ్రాబ్యాంక్-బడి చౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. శ్రీరామనవమి శోభాయాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలిరావాలని శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆహ్వానించింది.
మరోవైపు అంబర్పేట్ నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు కోఠి వ్యాయామ శాలకు వస్తాయి. ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్పేట చౌరస్తా వద్ద కలుస్తుంది. శాంతియుతంగా ఈ శోభా యాత్ర నిర్వహిస్తాం. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్న పానీయాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ ఒక్కరు ఈ శోభయాత్రలో పాల్గొనాలని .. ఉత్సవ కమిటీ సభ్యులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Liquor ban, Liquor shops, Local News