Home /News /telangana /

HYDERABAD WILL PETROL AND DIESEL PRICE COME DOWN FUTURE CENTRAL GOVERNMENT TAKE KEY DECISION NGS

Petrol price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. ఎందుకో తెలుసా..?

పెట్రోల్ ధరలు త్వరలో తగ్గే అవకాశం

పెట్రోల్ ధరలు త్వరలో తగ్గే అవకాశం

Will Petrol Price Down: గత కొన్ని రోజుల ముందు వరకు సెంచరీ దాటి పరుగులు పెట్టిన ఇంధనం ధరలు కాస్త తగ్గుతున్నాయి. తగ్గిన రేటు చాలా తక్కువే అయినా.. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గనుందా? పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయా? దానికి కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Will Petrol Price Down: దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు (Petrol diesel) వానదారులను ఏడిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ధరలు సెంచరీ దాటడంతో వాహనం బయకు తీయాలి అంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే గత కొన్ని రోజుల క్రితం కేంద్ర  ప్రభుత్వం (Central Government) నిర్ణయం కారణంగా కొద్దిగా రేట్లు తగ్గుదాయి.  భవిష్యత్తులో వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. ఇంధన ధరలను (Fuel rates) మరింత తగ్గించేలా చర్యలు చేపట్టిన కేంద్రం, ఇందులో భాగంగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లో ఉన్న 5 మిలియన్ క్రూడాయిల్ బ్యారెళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. దీని వల్ల ఇంధన సరఫరా పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

    గత నెల వరకు అసలు పెట్రోల్ రేట్లు పెరగడమే కానీ.. తగ్గడం అన్న విషయం మరిచిపోయాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలు దాటింది. దీంతో కేంద్ర తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు పెరిగాయా. సామాన్యులంతా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యతిరేకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఈ నెల మొదటి వారంలో పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ తగ్గించాయి. ఎక్సైజ్ సుంకంతో పాటు వ్యాట్ కూడా తగ్గడంత పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గాయి.

    ఇదీ చదవండి : సామాన్యుడి ఆహ్వానంపై స్పందించిన సీఎం.. ఆటోలో ఇంటికి వెళ్లి భోజనం.. వైరల్ గా మారిన వీడియో

    అయితే ఈ తగ్గుదల ఇక్కడితోనే ఆగిపోదు.. త్వరలో జరగనున్న ఎన్నికలు.. 2024 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న కేంద్రం.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజల ఆందోళనను గుర్తించింది. అందుకే దిద్దుబాటు చర్యలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌లో ఉన్న 5 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను రిలీజ్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌లో ఉన్న 5 మిలియన్ బ్యారెళ్లు అంటే 50 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ విడుదలైతే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగొస్తాయి.

    ఇదీ చదవండి: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. రెండు కేజీల బిర్యానీ తింటే టమాటో ఫ్రీ.. కానీ ఓ కండిషన్

    దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధర “సహేతుకంగా, బాధ్యతాయుతంగా మార్కెట్ శక్తులు నిర్ణయించాలి” అని భారతదేశం గట్టిగా విశ్వసిస్తోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన ద్వారా తెలిపింది.

    ఇదీ చదవండి: షాకింగ్ కార్ యాక్సిడెంట్.. ఇప్పటి వరకు ఇలాంటిది చూసి ఉండరేమో.. ఆరు వాహనాలపై ఎఫెక్ట్..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Fuel prices, Petrol price, Petrol prices

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు