దూరపు కొండలు నునుపు..అంటే అతను నమ్మలేదు..దగ్గరకు వెళ్లి చూస్తే కాని అర్ధం కాలేదు. ఇంట్లో ఉన్న భార్యను చూసి బోరు కొట్టిందో ఏమో వాట్సాప్‌లో పరిచయమైన మరో వివాహితతో ఫోన్‌లో గంటల తరబడి చాటింగ్ చేశాడు. ఆమె మాటలకు, ఛాటింగ్‌తో ఫ్లాట్ అయిపోయిన ఇద్దరు పిల్లల తండ్రి ..ఇంట్లో భార్య, పిల్లలను వదిలి ప్రియురాలి(Girlfriend)తో వెళ్లిపోయాడు. ఇది జరిగి రెండు నెలలు గడిచింది. బాధితుడు హైదరాబాద్ (Hyderabad) కూకట్‌పల్లి(Kukatpally)కి చెందిన ఓ ఉద్యోగస్తుడు. అతని భార్య కూడా జాబ్ చేస్తోంది. భర్త(Husband)కనిపించకుండా పోవడంతో భార్య (Wife)పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ (Cellphone signal)ఆధారంగా అతడి ఆచూకి కనుగొన్నారు. కనిపించకుండా పోయిన భర్త ఎక్కడుంది, ఏం చేస్తున్నది భార్యకు తెలియజేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ (Episode)లో ట్విస్ట్ (Twist)ఏమిటంటే ..కనిపించకుండాపోయిన భర్త సైబరాబాద్ పోలీసుల (Cyberabad Police)ముందు ప్రత్యక్షమయ్యాడు. తాను ఎక్కడికి పోలేదని..ఏదో చిన్న పొరపాటు జరిగిందని తన భార్యతో కలిసి జీవితం పంచుకునేలా ఒప్పించమంటూ కాళ్ల బేరానికి వెళ్లాడు. రెండు నెలల క్రితం భార్య, పిల్లల్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి వాళ్లతో కలిసి ఉండేందుకు ఇంతలా ఎందుకు తాపత్రయపడుతున్నాడని పోలీసులకు అనుమానం వచ్చింది. అందులో భాగంగానే ఆరా తీయడంతో షాకింగ్ న్యూస్ బయటపడింది.
భార్యకు తెలియకుండా ప్రియురాలితో జంప్..
రెండు నెలల క్రితం భార్య, పిల్లల్ని వదిలి ప్రియురాలితో వెళ్లిన వ్యక్తి వాళ్ల మీద ఉన్న ప్రేమతో తిరిగి రాలేదని తేల్చారు. ప్రియురాలుతో గడిపిన నెల రోజులు హ్యాపీగా కాకుండా ఎంతో కష్టంగా, భరించలేనంత భారంగా గడిపినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ప్రియురాలిని నమ్మి వెళ్లిన సదరు బాధితుడికి లగ్జరీ కోర్కెలు, కాస్ట్లీ మెయిన్‌టెన్స్‌తో ఆమె చుక్కలు చూపించిందని బాధితుడే స్వయంగా పోలీసుల దగ్గర గోడు వెళ్లబోసుకున్నాడు. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు రిచ్‌గా మెయిన్‌టెన్ చేయడంతో మనోడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఒక్క నెలలోనే ఆమె కోర్కెలు తీర్చడానికే 10లక్షలు అప్పులు చేశాడట. ఇంకా ఆమెతో ఉంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని డిసైడ్ అయిపోయాడు. అందుకే కట్టుకున్న భార్యే బెటరని ..కాళ్ల బేరానికి వచ్చాడు.
ఆమె ఇచ్చిన షాక్‌కి..
ఏ భార్యకైనా భర్త ప్రేమగా చూసుకోకపేతే పెద్దగా ఫీలవదు. కాని తనను కాదని మరో మహిళకు దగ్గరైతే భరించ లేదు. కూకట్‌పల్లిలోని పరాయి మహిళ మోజులో పడి భార్య, పిల్లల్ని వదిలి వెళ్లిన మొగుడి విషయంలో బాధితురాలు కూడా అదే చేసింది. తనను కాదని వెళ్లిపోయి..తిరిగి వచ్చిన భర్తతో కలిసి జీవించేందుకు అంగీకరించలేదు. పెద్దలు, పోలీసులతో భర్త ఎంత రాజీ ప్రయత్నం చేసినప్పటికి ససేమీరా అంటోంది. జరిగి తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని పశ్చాత్తాపడటంతో పోలీసులు కూడా ఇద్దర్ని కలిపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారట.సామెతలు పాతవే అయినా..కొన్ని మాత్రం జరుగుతున్న సంఘటనలకు సరిగ్గా సరిపోయేలా ఉంటాయి. ఈ ఘటన తరహాలోనే అంటున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.