హోమ్ /వార్తలు /తెలంగాణ /

Medak:తండ్రి చంపుతుంటే కూతురు చేతులు కట్టేసి పట్టుకుంది..ఇద్దరూ కలిసి చంపింది ఎవర్నో కాదు..

Medak:తండ్రి చంపుతుంటే కూతురు చేతులు కట్టేసి పట్టుకుంది..ఇద్దరూ కలిసి చంపింది ఎవర్నో కాదు..

OMG:భర్తతో గొడవపడిన భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. సర్దిచెప్పి తిరిగి ఇంటికి తెచ్చుకుందమని వెళ్లిన భర్తను తండ్రి సహాయంతో హతమార్చింది భార్య. ఇంతటి దారుణ ఘటన మెదక్ జిల్లా పోతన్పల్లిలో వెలుగుచూసింది.

OMG:భర్తతో గొడవపడిన భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. సర్దిచెప్పి తిరిగి ఇంటికి తెచ్చుకుందమని వెళ్లిన భర్తను తండ్రి సహాయంతో హతమార్చింది భార్య. ఇంతటి దారుణ ఘటన మెదక్ జిల్లా పోతన్పల్లిలో వెలుగుచూసింది.

OMG:భర్తతో గొడవపడిన భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. సర్దిచెప్పి తిరిగి ఇంటికి తెచ్చుకుందమని వెళ్లిన భర్తను తండ్రి సహాయంతో హతమార్చింది భార్య. ఇంతటి దారుణ ఘటన మెదక్ జిల్లా పోతన్పల్లిలో వెలుగుచూసింది.

(Kummari veeranna,medak Reporter,News18)

సంసారంలో భార్యభర్తల మధ్య వచ్చే సమస్యలు సందె- పొద్దులా పూటలో మర్చిపోయేలా ఉండాలి. అంతేగాని వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేంత కిరాతకంగా మారకూడదు. అలా ఆలోచిస్తే కుటుంబంలో మిగిలిన వ్యక్తులకే నష్టమనే చిన్న విషయాన్ని గుర్తు చేసుకోలేకపోయారు. మెదక్ జిల్లా (Medak district)చేగుంట (Chegunta)రాణా పరిధిలోని మాసాయిపేట మండలం పోతనపల్లి(Pothanpalli)లో జరిగిన దారుణ ఘటన సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది. పోతన్పల్లికి చెందిన హేమలత (Hemalata)తన భర్తన పిట్ల లక్ష్మయ్య(Pitla Lakshmayya)ను తండ్రి అరికెల రాములు(Arikela Ramulu)తో కలిసి చంపేసింది. కట్టుకున్న భర్త , సుమారు 20సంవత్సరాలుగా కలిసి కాపురం చేసింది. ఇంతకాలం కలిసి జీవితాన్ని పంచుకున్న భర్తను చంపాలన్న ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందనే విషయం తెలిసిన తర్వాత పోలీసులే షాక్ అయ్యారు. మృతుడు పిట్ల లక్ష్మయ్యతో గొడపడిన హేమలత చిన్న కొడుకుని భానుప్రసాద్‌(Bhanuprasad)ని తీసుకొని పోతన్పల్లిలోని పుట్టింటింకి వెళ్లింది. భర్తతో గొడవ పడిన విషయాన్ని తండ్రి అరికెల రాములుతో హేమలత చెప్పింది. గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య హేమలతను సర్ది చెప్పుకొని తిరిగి కాపురానికి తెచ్చుకోవాలని లక్ష్మయ్య అత్తారిల్లు పోతన్పల్లికి వెళ్లాడు. భార్యను తీసుకెళ్లేందుకు అల్లుడు ఇంటికి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మామ రాములు..అల్లుడిపై దాడి చేశాడు. భర్తపై తండ్రి దాడి చేస్తుండగా హేమలత సహాకరించింది. భర్త లక్ష్మయ్య రెండు చేతులను గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఇంట్లో ఉన్న రోకలిబండతో మామ రాములు అల్లుడు లక్ష్మయ్య తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భార్య, మామ చేతిలో చావు దెబ్బలు తిన్న లక్ష్మయ్య గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి వెంటనే అతడ్ని తుప్రాన్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే చనిపోయాడు.

తండ్రితో కలిసి భర్తను చంపింది..

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బంగ్లా వెంకటాపురానికి చెందిన 48సంవత్సరాల లక్ష్మయ్య 20సంవత్సరాల క్రితం హేమలతను వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు లక్ష్మయ్య. దాదాపు రెండు దశాబ్ధాలుగా సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో ఎలాంటి అరమరికలు లేవు. మూడ్రోజుల క్రితం భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవే ఇంతటి దారుణానికి దారి తీసింది. భర్తతో గొడపడిన హేమలత చిన్న కొడుకుని భానుప్రసాద్‌ని తీసుకొని పోతన్పల్లిలోని పుట్టింటింకి వెళ్లింది. సర్ది చెప్పుకొని తిరిగి ఇంటికి తెచ్చుకుందామని వెళ్లిన భర్తను తండ్రితో కలిసి భార్య హేమలత చంపడం స్థానికంగా కలకలం రేపింది.

చిన్న గొడవ చావు వరకు వెళ్లింది..

మృతుడు లక్ష్మయ్య పెద్ద కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు భర్తను హతమార్చడానికి సహాకరించిన హేమలతను అల్లుడిని రోకలిబండతో కొట్టి చంపిన మామ రాములుపై కేసు నమోదు చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టామని చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు.

First published:

Tags: Criminal women, Medak District news

ఉత్తమ కథలు