భర్తను చంపి పూడ్చిన కొద్ది రోజులకే మరో ప్లాన్.. నేరుగా కుమార్తె ప్రియుడికి ఫోన్ కాల్.. పెళ్లికి ఓకే చెప్పాలంటే ఓ హెల్ప్ కావాలంటూ..

నౌసిన్ బేగం, గగన్ అగర్వాల్ (పెళ్లి నాటి ఫొటో)

భర్తను చంపి, నెల రోజుల పాటు ఏమీ ఎరుగనట్టు నటించి, కుమార్తె ప్రియుడి సాయంతో ఖతార్ దేశానికి ఎస్కేప్ అవాలనుకున్న ఆమె, చివరకు కటకటాల పాలయింది. విచారణ జరుగుతున్న కొద్దీ ఈ ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.

 • Share this:
  నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నా భర్తకు విడాకులు ఇచ్చి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదటి భర్త వల్ల కలిగిన కూతుళ్లపై రెండో భర్త లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. చివరకు ఆరేళ్ల వయసున్న కూతురిపై కూడా లైంగిక వేధింపులకు అతడు పాల్పడటంతో ఆమె తట్టుకోలేక భర్తను మట్టుబెట్టింది. ఆ తర్వాత ఇంట్లోనే అప్పటికే తీసి ఉంచిన సెప్టిక్ ట్యాంక్ గుంతలో భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. భర్త మిస్సయ్యాడంటూ కట్టుకథలు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినా, టెక్నాలజీ సాయంతో పోలీసులు ఆమె చెప్పింది కథేనని తేల్చేశారు. ఆమెను నిలదీస్తే అసలు నిజం చెప్పేసింది. భర్తను చంపి, నెల రోజుల పాటు ఏమీ ఎరుగనట్టు నటించి, కుమార్తె ప్రియుడి సాయంతో ఖతార్ దేశానికి ఎస్కేప్ అవాలనుకున్న ఆమె, చివరకు కటకటాల పాలయింది. విచారణ జరుగుతున్న కొద్దీ ఈ ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.

  హైదరాబాద్ లోని పాతబస్తీ యాకత్ పురాకు చెందిన నౌసిన్ బేగం అనే 32 ఏళ్ల మహిళకు కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు కూడా ఉన్నారు. అయితే తరచూ భర్తతో గొడవలు అవుతుండటంతో అతడికి విడాకులు ఇచ్చింది. అయిదుగురు పిల్లలతో కలిసి వేరుగా ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గగన్ అగర్వాల్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు అతడు కూడా భార్యకు విడాకులు ఇచ్చి వేరుగా ఉంటున్నాడు. వీళ్లిద్దరూ గతేడాది జూన్ నెలలో ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. అయిదుగురు పిల్లలతో సహా ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి వివేకానందనగర్ కాలనీలో కాపురం పెట్టారు. మొదటి భర్త వల్ల కలిగిన నలుగురు కూతుళ్లలో ఇద్దరిపై వేధింపులు మొదలు పెట్టాడు. చివరకు తన ఆరేళ్ల కూతురుని కూడా వదలకుండా, ఆ పసిపాపతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది.
  ఇది కూడా చదవండి: నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి.. ఇంట్లోనే భర్తను పూడ్చిపెట్టిన చోట రోజూ నీళ్లు చల్లిన భార్య.. చంపి మంచి పనే చేశానంటూ కామెంట్స్

  ఫిబ్రవరి 8వ తారీఖు రాత్రి గగన్, సునీల్ కలిసి ఇంట్లోనే మద్యం తాగారు. అదే అదనుగా ఇంట్లో ఉన్న కత్తిని భర్త గొంతులో దించింది. అక్కడికక్కడే పడిపోయిన అతడిపై పలుమార్లు దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత గగన్ శవాన్ని మాయం చేసేందుకు నౌషీమ్ కు సహకరించాడు. ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్ నిర్మించడానికి ఓ పదిహేను రోజుల క్రితం తవ్విన గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం పిల్లలతో సహా తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, భర్తను చంపిన తర్వాత ఆమె వివిధ ప్లాన్స్ వేసిందని విచారణలో తేలింది. తాను ఇక్కడే ఉంటే దొరికిపోవడం ఖాయమని ఆమె భావించింది. అందుకే విదేశాలకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. దీనికోసం కూతురిని ప్రేమించిన ఓ యువకుడి సహాయం తీసుకుంది.
  ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

  తన కూతురికి సోషల్ మీడియాలో మెహిదీపట్నం కు చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని కూడా ఆమెకు తెలిసింది. దీంతో కూతురిని అడిగి, అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది. కుమార్తె ప్రియుడికి నేరుగా ఫోన్ చేసింది. ‘నువ్వు నా కూతురిని నిజంగా ప్రేమిస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా‘ అని అడిగింది. దానికి అతడు అవునని సమాధానం ఇచ్చాడు. అయితే ’నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నాకు ఓ సహాయం చేయాలి‘ అంటూ ఆమె మెలిక పెట్టింది. ఖతార్ లోని దోహాకు వెళ్లేందుకు విమాన టికెట్లను తన పేరుమీద బుక్ చేయాలని కోరింది. దానికి అతడు సరేనని, టికెట్లను బుక్ చేసి పంపించాడు. ఈ టికెట్లను తన భర్త సోదరికి వాట్సప్ లో మెసేజ్ పెట్టింది. ’నేను స్నేహితుడి పెళ్లికి ఢిల్లీకి వెళ్తున్నాను. అక్కడి నుంచి దోహాకు వెళ్తున్నాను. వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఈ లోపు భర్త గురించి ఏమైనా సమాచారం తెలిస్తే నాకు చెప్పు‘ అంటూ విమాన టికెట్లను భర్త సోదరికి ఆమె వాట్సప్ మెసేజ్ లో పంపించింది.
  ఇది కూడా చదవండి: సోదరుడి రూమ్ కు వెళ్లిన యువతి.. నిద్రలోంచి మెలకువ వచ్చి తిరిగి ఇంటికి.. రెండ్రోజుల తర్వాత వాట్సప్ లో వచ్చిన ఫొటోను చూసి..

  పోలీసులకు ఈ విషయం తెలియడంతో విచారణను వేగవంతం చేశారు. అతడు చివరగా ఫోన్ వాడిన లొకేషన్ లోనే, భార్య ఫోన్ లొకేషన్ ను కూడా చూపించడంతో పోలీసులకు ఈ కేసులో చిక్కుముడి వీడినట్టయింది. సాంకేతిక ఆధారాలను చూపించి పోలీసులు నిలదీయడంతో ఆమె నిజం ఒప్పుకోక తప్పలేదు. పోలీసుల విచారణలో ఆమె దోషిగా తేలిన తర్వాత కూడా, ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం గమనార్హం. ’నా భర్తలాంటి మృగాన్ని చంపి నేను మంచి పనే చేశాను. అతడిని పెళ్లి చేసుకున్నందుకు చింతిస్తున్నా. అతడిని చంపినందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా పిల్లలు అనాథలయ్యారన్న బాధ మాత్రమే ఉంది. ఈ హత్యను నేను మాత్రమే చేశాను. పూడ్చి పెట్టడానికి మాత్రమే సునీల్ సాయం తీసుకున్నాను.’ అని నౌషీమ్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న సునీల్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
  ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..
  Published by:Hasaan Kandula
  First published: