HYDERABAD WIFE KILLS HUSBAND WITH BOYFRIEND IN SANGAREDDY DISTRICT AMINPUR SNR MDK
OMG:ఆ ఆంటీకి భర్త కంటే ప్రియుడిపైనే మోజు ఎక్కువ..అందుకే అంత బరితెగించింది
భర్తను ప్రియుడితో చంపించిన భార్య
OMG: ప్రియుడితో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ కిరాతకానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్కి చెందిన పద్మ ప్రియుడు రెహమాన్ సాయంతో భర్త వెంకటప్పను హత్య చేయించింది. మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు మర్డర్ చేసిన పద్మ, రెహమాన్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
క్షణికానందం కోసం ...శారీరక సుఖాన్ని ఇస్తున్న ప్రియుడితో చేతులు కలిపి తాళి కట్టిన భర్తను హత్య చేసింది ఓ కిరాతకురాలు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే తరహాలో ఓ వివాహిత ప్రవర్తించిన తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy district)అమీన్పూర్ (Aminpur)పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఎరికల వెంకటప్ప(Venkatappa), పద్మ (Padma)దంపతులు చందానగర్‌లో నివాసముంటున్నారు. దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న పద్మకు రెహమాన్(Rahman)అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. చందానగర్‌లో అడ్డా కులిగా ఉంటున్న రెహమాన్ తరచూ పద్మ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈక్రమంలోనే వారిద్దరి పరిచయం వివాహేతర సంబంధా(Illicit relationship)నికి దారి తీసింది. అది కాస్తా భర్త వెంకటప్పకు తెలియడంతో పద్మను మందలించాడు. అంతే ప్రియుడిపై ఉన్న మోజుతో భర్త తమ శారీరక సుఖానికి అడ్డుపడుతున్నాడని భావించింది. ఆ ఆలోచనతోనే నేరపూరితురాలిగా మారిపోయింది. భర్త మందలించినప్పటికి పదే పదే పద్మ, రెహమాన్ శారీరకంగా కలుస్తూ ఉండేవారు. భర్త వెంకటప్ప అడ్డును శాశ్వతంగా తొలగించుకుంటే ఇద్దరూ కలిసి ఇష్టానుసారంగా గడపవచ్చని ప్లాన్ వేసుకున్నారు. అందుకోసం పద్మ తాళికట్టిన భర్త వెంకటప్పను ప్రియుడు రెహమాన్ సహకారంతో అంతమొందించాలని పథకం వేసింది. ఇందులో భాగంగానే ఈనెల 10వ తేదిన వెంకటప్పను మద్యం తాగుదాం రమ్మని చెప్పి రెహమాన్ బైక్‌పైన ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఆతర్వాత వెంకటప్ప కనిపించలేదు. స్థానికుల ద్వారా మిస్సింగ్ కేసు (Missing case)నమోదు చేసుకున్న పోలీసులు పద్మను నిలదీశారు. ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంతో పాటు ప్రవర్తనలో తేడా గమనించిన పోలీసులు తమదైన శైలీలో విచారించారు.
ప్రియుడి కోసం మొగుడ్ని మింగేసింది..
వెంకటప్ప మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు అతని అదృశ్యం వెనుక మర్డర్ స్కెచ్ దాగి ఉందని రాబట్టారు. వెంకటప్పను హతమార్చిన పద్మ, రెహమాన్‌తో పాటు హత్యకు సహాకరించిన సుభాష్ అనే మహరాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అధుపులోకి తీసుకున్నారు. వారిపై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లుగా పటాన్చెరు డిఎస్పి భీంరెడ్డి వెల్లడించారు.
శారీరక సుఖం కోసం తెగించింది..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పద్మ ప్రియుడితో వెంకటప్పను హత్య చేయించేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే మద్యం తాగుదామని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు రెహమాన్. అక్కడ ముందే తన స్నేహితుడైన సుభాష్ సహకారం తీసుకున్నాడు. బైక్‌పై ఎక్కించుకొని వెంకటప్పను చక్రపురి కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేశారు. మిస్సింగ్ కేసు వెనుక వివాహేతర సంబంధమే హత్యకు కారణమైనట్లుగా పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. నిందితుల్ని పట్టుకోవడంలో అమీన్పూర్ ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి నేరస్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.