హోమ్ /వార్తలు /తెలంగాణ /

భర్తకు 17 ఏళ్ల బాలికతో పెళ్లి చేసిన భార్య.. ఆ తర్వాత చంపేసింది.. ఇంతకి ఏం జరిగింది?

భర్తకు 17 ఏళ్ల బాలికతో పెళ్లి చేసిన భార్య.. ఆ తర్వాత చంపేసింది.. ఇంతకి ఏం జరిగింది?

నిందితురాలు

నిందితురాలు

Hyderabad: భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో.. బాలికతో కలిసి భర్తను హత్య చేసింది రేణుక. మెడకు శాలువగా బిగించి.. అటూ ఇటూ లాగడంతో... ఊపిరాడక సురేష్ చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇది సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించే రియల్ స్టోరీ. వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు పాటు కాపురం చేశారు. కానీ ఈ మధ్య ఆమె చెడు వ్యసనాల బాటపట్టింది. మద్యానికి బానిసైంది. ఇది చాలదన్నట్లు భార్యాభర్తల మధ్యలో ఓ బాలిక వచ్చింది. ఆ తర్వాత.. అంతా తలకిందులయింది. అందరి జీవితాలు నాశనమయ్యాయి. ఈ ఇద్దరు ఏకమై.. అతడిని చంపేశారు. హైదరాబాద్ శివారులో ఈ ఘటన జరిగింది. అసలు ఆ ముగ్గురి మధ్య ఏం జరిగింది? అతడిని ఎందుకోసం చంపాల్సి వచ్చింది. ఆ వివరాలను తెలుసుకుందాం.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముండే సురేష్ (28), రేణుక భార్యాభర్తలు. వీరికి 2016లో వివాహం జరిగింది. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐతే సోమవారం సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. తన భర్త మటన్, మల్లెపూలు తెచ్చేందుకు బయటకు వెళ్లాడని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని మృతుడి భార్య రేణుక.. పోలీసులకు చెప్పింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే శవాన్ని పడేశారని ఫిర్యాదు చేసింది. ఇంతకు మించి పోలీసులకు ఎలాంటి క్లూ లేదు. కానీ మృతుడి బంధువులకు అతడి భార్య రేణుకపైనే అనుమానం ఉందని చెప్పడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. రేణుకను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలకు తెలిశాయి. మరో బాలికతో కలిసి రేణుకే.. భర్తను చంపేసింది.

దర్యాప్తులో తేలింది ఇదే..

రేణుక కొంత కాలంగా చెడు వ్యసనాలకు అలవాటు పడింది. నిత్యం కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వెంట తిరిగేది. పరాయి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడేదని స్థానికులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం బహదూర్‌పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్‌ తండాకు చెందిన అనాథ బాలికతో రేణుక మాట కలిసింది. మాటా మాటా కలవడంతో.. పరిచయం పెరిగింది. బాలికకు ఎవరూ లేకపోవడంతో.. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లింది రేణుక. గత 15 రోజులుగా ఆ అమ్మాయి రేణుక ఇంట్లోనే ఉంటోది. ఐతే చెడు వ్యవసనాలకు అలవాటు పడిన రేణక.. భర్త మెప్పుకోసం ఆ బాలికతో భర్తకు రహస్యగా పెళ్లి చేసిందట. బాలిక తనకు దగ్గరవ్వడంతో... సురేష్ తన భార్య రేణుకను వదిలించుకునేందుకు ప్రయత్నించాడట. ఈ విషయమై ఇద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి సురేష్, రేణుక, ఆ బాలిక.. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో.. బాలికతో కలిసి భర్తను హత్య చేసింది రేణుక. మెడకు శాలువగా బిగించి.. అటూ ఇటూ లాగడంతో... ఊపిరాడక సురేష్ చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం శవాన్ని బ్యాగ్‌లో పెట్టి..తమ ఇంటి రెండో అంతస్తు నుంచి కిందకి విసిరేశారు. ఆ తర్వాత డ్రామా మొదలు పెట్టారు. సురేష్ బంధువులకు పదే పదే ఫోన్లు చేసిన రేణుక.. మటన్, మల్లెపూలు తీసుకొచ్చేందుకు వెళ్లి సురేష్... ఇంకా రాలేదని.. ఏదో భయంగా ఉందని చెప్పింది. ఆ తర్వాత మరుసటి మళ్లీ ఫోన్ చేసి.. సురేష్‌ను ఎవరో చంపి పడేశారని చెప్పి.. కన్నీళ్లు పెట్టింది. తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ బంధువులకు ఆమెపైనే అనుమానం రావడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎట్టకేలకు నిజం చెప్పింది. నేరాన్ని అంగీకరించింది.

First published:

Tags: Crime news, Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు