Joint killers : కిలాడి జంట నేర చరిత్ర.. భార్య కూడా ఒకప్పటి భాదితురాలే... రోజుకొకరు లేనిదే నిద్రపట్టని నిందితుడు..

ప్రతీకాత్మక చిత్రం

Joint killers : ముప్పై సంవత్సరాల జీవితం..రోజు మహిళలు లేనిదే జీవితం లేదనే వికృత ధోరణిలోకి స్వామి అలవాటుపడ్డాడు. దీంతో తాను మనసు పడ్డవాళ్లను ఖచ్చితంగా అనుభవించాలనే కోరికతో రగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే కన్నుపడిన అడ్డకూలీలను తన వశం చేసుకునే దాకా వదిలపెట్టేవాడు కాదనే విషయలు పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి...

 • Share this:
  మహిళా అడ్డా..కూలీ హత్య కేసులో నిందుతుడిగా ఉన్న స్వామికి సహకరించిన నర్సమ్మ కూడా ఒకప్పటి భాదితురాలనే నిజాలు వెలుగు చూశాయి..స్వామి వ్యక్తిగత జీవితమంతా జల్సాలకు అలవాటు పడింది..కష్టపడకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపేవాడు. ఈ పరిస్థితుల్లోనే మార్కెట్లు, లేబర్ అడ్డాలపై అందంగా ఉండి ,ఒంటిపై బంగారు నగలు ఉన్న వారిని టార్గెట్ చేసేవాడు.వారిని ట్రాప్‌లోకి దింపి...సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకువెళ్లెవాడు . అనంతరం వారిపై అఘాయిత్యం చేసిన తర్వాత వారి ఒంటీమీద ఉన్న బంగారం తీసుకుని పారిపోయెవాడు...

  ఇలా గత తొమ్మిది సంవత్సరాల క్రితం కూలిపనికి వచ్చిన నర్సమ్మను, ఇదే పద్దతిలో స్వామి లోబరుచుకున్నాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఇలా అత్యాచారంతోనే స్వామి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నర్సమ్మ తన భర్తతోపాటు ఇద్దరు పిల్లల్ని కూడా వదిలి స్వామితో జతకట్టింది.. ఇలా ఇద్దరు కలిసి కొద్ది రోజులు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

  ఇక అప్పటి నుండి ఇద్దరు కలిసి అమయాక కూలీలను మాయమాటలతో లోబరుచుకోవడం.. ఆ తర్వాత నర్సమ్మ భర్తకు సహకరించడం లాంటీ చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా మహిళలను టార్గెట్ చేసుకున్న మహిళల వద్ద బంగారం ఎత్తుకుపోవడం..ఆ బంగారాన్ని కుదువపెట్టి దాదాపు ఇరవై రోజుల పాటు జల్సాలు చేయడం అలవాటుగా మారిపోయింది..డబ్బులు అయిపోగానే తిరిగి మరో మహిళ వేటలో పడడం ,అత్యాచారం చేయడం చేసేవాడు.. ఇలా తీసుకువచ్చిన మహిళలను మహిళలను తనకు సహకరిస్తే...అత్యాచారం చేసి వదిలి పెట్టేవాడు..ప్రతిఘటించిన మహిళలను నరకం చూపించేవాడు. బయటకు వెళ్లిన తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయరని భావిస్తే...వదలేసేవాడు..ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని అనుమానం వస్తే మాత్రం కిరాతంగా చంపేసేవాడని తెలుస్తోంది.

  మరోవైపు నర్సమ్మను కూడా లైంగిక వేధింపుకు గురి చేసేవాడు..రోజుకు ఓ మహిళ తనకు కావాలని అడిగేవాడని, అలా లేదంటే తనను వదిలేస్తానని బెదిరించేవాడని నర్సమ్మ తన విచారణలో తెలిపింది. అందుకు స్వామి చేసే అత్యాచారాలు ,అఘాయిత్యాలకు సహకరించేదాన్నని ఆమె తెలిపింది.ఇక ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డ జంట ఎవరికి అనుమానం రాకుండా ప్రతి రెండు నెలలకు ఓసారి తన మకాం మార్చే వారు. అందుకు ఇంట్లో కనీసం నివసించేందు ఎలాంటీ వస్తువులను తీసుకునేవారు కాదని పోలీసుల విచారణలో తేలాయి..

  కాగా ఇద్దరు భార్య భర్తలు కలిసి ఓ గిరిజన మహిళనలు కూలీ పనుల కోసమని తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే...
  Published by:yveerash yveerash
  First published: