Home /News /telangana /

HYDERABAD WHY DOES THE CM KCR NOT ATTENDING TO THE KRMB MEETING ASKED TPCC CHIEF REVANTH REDDY VRY

Revanth reddy : సీఎం కేసిఆర్‌ది రహస్య ఎజెండా...అందుకే రెచ్చగొట్టె వ్యాఖ్యలు...

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (ఫైల్)

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (ఫైల్)

Revanth reddy : రెండు రాష్ట్రాల జల వివాదంలో సీఎం కేసిఆర్‌ తీరును టీపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నీటి హక్కుల కోసం చట్ట ప్రకారం పోరాటం చేయకుండా.. రహస్య ఎజెండా పెట్టుకుని వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇంకా చదవండి ...
    రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాలపై వివాదం చెలరేగిన నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దీంతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిచారు. జల వివాదంపై చట్టప్రకారం పోరాటం చేయకుండా రాజకీయ లబ్ధి పొందేందుకు సీఎం కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా సీఎం కేసిఆర్‌కు చిత్తశుద్ది ఉంటే..కేఆర్ఎంబీ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 9న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు.. లేదంటే.. సీఎం జగన్, కేసిఆర్‌లు ఇద్దరు ఒక్కటేనని భావించాల్సి ఉంటుందని అన్నారు.

    ఇక సీఎం కేసిఆర్ వైఖరి వల్లే ఏపీ సీఎం జగన్ తెలంగాణ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. గత ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కృష్ణానదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయాలేదని ప్రశ్నించారు. 50వేల కోట్ల రూపాయలతో తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశాలు ఉన్నా సీఎం వాటిని పక్కన పెట్టారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుమీద ఇప్పటి వరకు మొత్తం లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారని...కాని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని విమర్శించారు..అయితే.. గోదావరి నదిపై నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుకే 90 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగా కృష్ణా నదీపై ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అవి కూడా పెండింగ్ ప్రాజెక్టులపై కాకుండా... కొత్త ప్రాజెక్టులు చేపట్టారని, దానివల్ల ఒక ఎకరాకు కూడా ప్రయోజనం కల్గడం లేదని ఫైర్ అయ్యారు.

    ఇక కేసిఆర్, జగన్‌లను వేర్వేరుగా చూడలేమని ఈ సంధర్బంగా స్పష్టం చేశారు..ఇద్దరి మధ్య హిడెన్ ఎజెండా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసిఆర్ స్వయంగా ఆహ్వనిస్తే... సీఎం జగన్ వచ్చాడని...కాని ఆయనే నేడు ఫిర్యాదు చేయడంపై ప్రజలు ఆలోచించాలని కోరారు.

    మరోవైపు తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడడం, ఇరుపార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంపై అంతర్గత రాజకీయం ఇమిడి ఉందని ప్రజలు గుర్తించాలని కోరారు...మరోవైపు ఈనెల 9న కేఆర్ఎంబీ సమావేశం ఉంటే ఎందుకు బహిష్కరిస్తున్నావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది సీఎం వ్యక్తిగత సమస్య కాదని తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన భాద్యత అని గుర్తు చేశారు.

    తెలంగాణపై సీఎం కేసిఆర్‌కు చిత్తశుద్ది ఉంటే ఈనెల 19న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని...కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరగేందుకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్‌లు ఇద్దరు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Revanth reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు