YS Family: జగన్-షర్మిలలో వైఎస్ ఫ్యామలీ సపోర్ట్ ఎవరికి..? విజయమ్మ ఒకరికి దూరం కావాల్సిందేనా..?

వైఎస్ ఫ్యామిలీ సపోర్ట్ ఎవరికి..?

YS Family: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అతి పెద్ద రాజకీయ ఫ్యామిలీ.. రెండేళ్ల ముందు వరకు అంతా ఒకే మాటపై ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం నుంచి రెండు పార్టీలు ఏర్పాడ్డాయి. మరి రెండు పార్టీల్లో వెఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఎవరికి ఉంటుంది..? తల్లి విజయమ్మ ఇద్దరిలో ఒకరిని దూరం పెట్టక తప్పదా..?

 • Share this:
  YS Family:  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వైఎస్ ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. కొన్ని లక్షల్లో ఆయనకు తెలుగు రాష్టాల్లో అభిమానులు ఉన్నారు. జగన్ ను తీవ్రంగా విమర్శించే విపక్షాలు సైతం వైఎస్ తీరును మెచ్చుకుంటాయి. ఆయనను పల్లెత్తు మాట కూడా అనవు. కొన్ని దశబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను రాజకీయంగా శాసించింది వైఎస్ కుటుంబం. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ ఏపీ సీఎంగా ఉన్నారు. కానీ అలాంటి అతి పెద్ద కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోతోంది. నేటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి రెండు పార్టీలు ఉండబోతున్నాయి. అది కూడా వైఎస్ జయంతి రోజు నుంచే.. ఒకటి జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొకటి.. షర్మిలకు చెందిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వీరిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలే. ఓ పార్టీ ఏపీలో.. మరో పార్టీ తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలో ఒకే రాష్ట్రంలో పోటీ పడే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి ఈ రెండు పార్టీల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఎవరికి ఉంటుంది..

  సభ్యులందరూ రెండు పార్టీల్లో ఉండటానికి అవకాశం లేదు. అయితే జగన్ పార్టీలో ఉండాలి.. లేకపోతే.. షర్మిల టీంలో ఉండాలి. ఎందుకంటే జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా షర్మిల పార్టీ పెడుతున్నారనిదానిపై ఇప్పటికే విజయమ్మ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య మాటలు కూడా లేవు. ఒక వేళ షర్మిల పార్టీకి మద్దతు తెలిపితే.. జగన్మోహన్ రెడ్డి వద్ద ఆదరణ దొరకడం కష్టమే. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి నైజం ప్రకారం.. ఆయన వ్యతిరేకులతో కలిసేవారిని ఎప్పుడూ ఆదరించరు. అందుకే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవరు ఎటు వైపు ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

  ఇదీ చదవండి: జగన్–షర్మిల మధ్య పలకరింపులు కూడా లేనంత విబేధాలు..! ఇదే సాక్ష్యం

  ప్రధానంగా అందరి దృష్టి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిపై ఉంది. ఆమె గతంలో ఖమ్మంలో జరిగిన షర్మిల పార్టీ సభకు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆవిర్భావ సభకు హాజరవబోతున్నారు. ఆమెను తన పార్టీకి తల్లిని గౌరవాధ్యక్షురాలిగా కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో ఇతర కుటుంబ సభ్యులు షర్మిల పార్టీ కి మద్దతు తెలుపుతారా లేదా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. విజయమ్మ షర్మిలతో ఉంటే అత్యధిక మంది వైఎస్ కుటుంబసభ్యులు, షర్మిల వెంట ఉండే అవకాశం ఉంది. దాదాపుగా నలభై మందికిపైగా ఫ్యామిలీ మెంబర్స్.. షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో భాగం అవుతున్నారని సమాచారం. ఈ అంశంపై ఇప్పుడు పులివెందులలోనూ హాట్ టాపిక్ అవుతోంది.

  ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కారణమేంటి..? పవన్ ఏమన్నారంటే..?

  తమ ఇంటి బిడ్డ తెలంగాణలో పార్టీ పెడుతున్నారని.. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామన్న వాదన వారిలో వినిపిస్తోంది. అయితే.. తమ కుటుంబంలో తాను వ్యతిరేకించిన ఘటనకు ఎక్కువ మంది మద్దతు తెలిపితే.. జగన్‌కు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారన్నది చూడాలి. సొంతం కుటుంబ సభ్యులతో శత్రుత్వం పెంచుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో జగన్ ఎలా ముందుకెళ్తారన్నది చూడాలి.
  Published by:Nagesh Paina
  First published: