హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేటీఆర్ ను డాక్టర్ గా చూడాలనుకున్నది ఎవరు?..ఆసక్తికర విషయం పంచుకున్న యువనేత

కేటీఆర్ ను డాక్టర్ గా చూడాలనుకున్నది ఎవరు?..ఆసక్తికర విషయం పంచుకున్న యువనేత

PC: Twitter

PC: Twitter

సాధారణంగా మన చిన్న వయసులో నువ్వు ఏమి కావాలని ఆకుంకుంటున్నావ్ అని ఎవరైనా అడిగితే డాక్టర్, ఇంజనీర్ అనే సమాధానం ఇస్తుంటారు. అయితే చాలా మంది సినీ స్టార్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటూ చెప్పుకొచ్చిన సంధర్బాలెన్నో ఉన్నాయి. మన తల్లిదండ్రులు కూడా మనల్ని మంచి స్థానంలో ఉండాలనే కోరుకుంటారు. అయితే దీనికి రాజకీయ నాయకులేమి మినహాయింపు కాదు. తాజాగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలో నిర్వహించిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాన్ క్లెవ్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన తల్లి కూడా తనను డాక్టర్ చూడాలని గట్టిగా కోరుకున్నారని అన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల రాజకీయాల్లో అడుగుపెట్టానని కేటీఆర్ (Minister KTR) తెలిపారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా మన చిన్న వయసులో నువ్వు ఏమి కావాలని ఆకుంకుంటున్నావ్ అని ఎవరైనా అడిగితే డాక్టర్, ఇంజనీర్ అనే సమాధానం ఇస్తుంటారు. అయితే చాలా మంది సినీ స్టార్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటూ చెప్పుకొచ్చిన సంధర్బాలెన్నో ఉన్నాయి. మన తల్లిదండ్రులు కూడా మనల్ని మంచి స్థానంలో ఉండాలనే కోరుకుంటారు. అయితే దీనికి రాజకీయ నాయకులేమి మినహాయింపు కాదు. తాజాగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలో నిర్వహించిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాన్ క్లెవ్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన తల్లి కూడా తనను డాక్టర్ చూడాలని గట్టిగా కోరుకున్నారని అన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల రాజకీయాల్లో అడుగుపెట్టానని కేటీఆర్ (Minister KTR) తెలిపారు.

Telangana: తెలంగాణలో KA పాల్ పాదయాత్ర..ముహూర్తం ఫిక్స్..ఎప్పటినుంచంటే?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరపైకి కేసీఆర్ పేరు..ఆ ఇద్దరు సీఎంలు కూడా..తరుణ్ ఛుగ్ సంచలన ఆరోపణలు

ప్రతి ఇంట్లో తల్లి తమ పిల్లల్లో ఒక్కరైనా డాక్టర్ కావాలని అనుకుంటారు. అలాగే తమ తల్లి కూడా అలాగే అనుకుందని కేటీఆర్ అన్నారు. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైంది. వైద్యరంగంలో మహిళల రాణించడం అభినందనీయం అన్నారు. వైద్యరంగంలో భారత్ ఎంతో పురోగమిస్తుందని అన్నారు. ఇక కరోనా టీకా తయారీలో మహిళల పాత్ర మరిచిపోలేనిదని గుర్తు చేశారు.

కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారు..

వైద్యరంగం ఎంతో ఉన్నతమైనది. వైద్యులు కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా అందుబాటులోకి వస్తారని అన్నారు. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని అన్నారు. ఇక వైద్య రంగంలో మహిళల సేవలు గొప్పవని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం కోసం వీ హబ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. కరోనా సమయంలో AIG ఆసుపత్రి సేవలు మరువలేనివని కేటీఆర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

First published:

Tags: Corona campaigned, Hyderabad, KTR, Minister ktr, Telangana

ఉత్తమ కథలు