HYDERABAD WHAT AN IDEA SIR JI AFTER DRINKING COCONUT WATER THAT EMPTY COCONUT BIG BUSINESS AND MORE PROFITS NGS BK
Business idea: తాగి పడేసిన కొబ్బరి బొండాలతో వ్యాపారం.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
తాగి పడేసిన కొబ్బరి బొండాలతో బిజినెస్
Business Idea: కొబ్బరి నీళ్లు దాహం తీర్చడానికే కాదు.. ఆ నీళ్లను తాగితే చాలా లాభాలు ఉంటాయి.. అలా తాగిన తరువాత.. అందులో కొబ్బరి ఉంటే కొందరు తింటారు.. తరువాత పడేస్తారు.. కానీ ఓ వ్యక్తి మాత్రం వాటిని తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?
M. Bala Krishna, Hyderabad, News18. Empty Coconut Business: కొంబరి బొండాన్ని చాలామంది తాగుతూ ఉంటారు.. ఆ నీళ్లు దాహాన్ని తీర్చడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడతాయి. అయితే కొబ్బరిబోండం తాగేసాక ఎవరైనా ఏం చేస్తారు.. అందులో కొబ్బరి ఉంటే కొందరు తింటారు.. తరువాత కింద పడేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం.. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. మనందరం కొబ్బరిబోండం తాగేసాక ఖాళీ బొండాన్ని పడేస్తాం కానీ ఆ యువకుడు మాత్రం మనలా ఆలోచించలేదు. అందుకే ఈరోజు అందరూ తాగి పడేసిన కొబ్బరి బోండం నుంచి కోట్లు సంపాదిస్తున్నాడు. ఏంటి తాగి పడేసిన కొబ్బరిబోండం నుంచి కోట్ల అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ లో అడుగుకోక కొబ్బరిబోండం షాప్ ఉంటుంది . నిత్యం వీటి ద్వారా పెద్ద మొత్తంలో తాగి పడేసిన కొబ్బరి బొండాలు వస్తువుంటాయి. ఈ బొండాలన్నీ జవహర్ నగర్ లో ఉన్న డంప్ యార్డ్ కి నిత్యం జిహెచ్ఎంసీ తరలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే హైదరాబాద్ కు చెందిన నాగరాజు అనే యువకుడు అందరికంటే భిన్నం గా ఆలోచించి తాగి పడేసిన బొండాలు నుంచి కోట్ల వ్యాపారం చేస్తున్నాడు.
నిత్యం సిటీలో తాగి పడేసిన బొండాలను సేకరించి వాటి నుంచి వివిధ వస్తువులు తయారీకి ఉపయోగపడే ముడి సరుకును ఉత్పత్తి చేస్తున్నాడు. నగర శివార్లలో ఒక చిన్న ప్లాంట్ ని ఏర్పాటు చేసుకొని 12 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా బొండాల నుంచి ముడి సరుకుని ఉత్పత్తి చేసి యువతకు ఆదర్శం గా నిలుస్తున్నాడు. నగరం లో వివిధ ప్రాంతాల నుంచి సేకరించి మూడు టన్నుల ఖాళీ కొబ్బరి బొండాల నుంచి 50 శాతం పీచు, 50 శాతం కొబ్బరి ఎరువును తయారు చేస్తున్నాడు.
ఇదీ చదవండి : సీఎం జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదే.. జనవరి 01వ తేదీ నుంచి వారి అకౌంట్లో రూ.2500
ఇలా ఉత్పత్తి చేసిన ముడి సరుకుని హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల కు కూడా ఎగుమతి చేస్తున్నాడు నాగరాజు. నాగరాజు ప్లాంట్ లో తయారైన పీచు తో సోఫాలు , కుర్చీలు మొదలగు వస్తువులు తయారీలో వాడుతున్నారు. ప్రస్తుతం నాగరాజు దగ్గర 12 మంది మని చేస్తున్నారు. తన సొంత వాహనాలను ఏర్పాటు చేసుకొని సిటీ లో పలు ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలను సేకరిస్తున్నారు.
" మొదట ఈ ప్లాంట్ ను తన తండ్రి ప్రాంభించారు . కొద్ది రోజులకు నష్టాలు రావడంతో ప్లాంట్ క్లోజ్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ఎలా అయినా మళ్ళీ ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఆలోచించినప్పుడు తనకు ఈ ఐడియా వచ్చింది అన్నాడు. అసలు కొబ్బరి బొండాల నుంచి ఎందుకు పీచు తయారు చెయ్యకూడదు అని కొన్ని రోజులు స్టడీ చేసి సొంతగా ప్రత్యేకంగా యంత్రాలను రూపొందించుకొని 2014 లో ఈ ప్లాంట్ ను మళ్ళీ ప్రాంభించమంటున్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి చూడకునే అవసరమే రాలేదు . రోజుకు 3౦ టన్నుల కొబ్బరి బొండాల తో దాదాపు 3 టన్నుల ముడి సరుకు ఉత్పత్తి చేస్తాం. ఇలా ఉత్పత్తి చేసిన సరుకుని ఇతర రాష్ట్రాల తోపాటు నగరం లో కూడా సరఫరా చేస్తాం."అని న్యూస్18 కి తెలిపారు నాగరాజు. నాగరాజు సొంతగా యంత్రాలను తయారు చేసుకోవడానికి దాదాపు 20 లక్షలు వరకు ఖర్చు చేశారు. ఆసక్తి ఉన్న యువతకు ఈ బిసినెస్ ఎలా చేయాలో కూడా చెప్పటానికి తాను సిద్ధమని అంటున్నారు నాగరాజు. వ్యర్ధల నుంచి కూడా కోట్లు సంపాదించే నాగరాజు ఐడియా కి సెల్యూట్ చేయాల్సిందే.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.