హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad:బెంగాల్ అమ్మాయిలతో చీకటి వ్యాపారం..సరూర్‌నగర్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్

Hyderabad:బెంగాల్ అమ్మాయిలతో చీకటి వ్యాపారం..సరూర్‌నగర్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Hyderabad:హైదరాబాద్ సిటీలో మళ్లీ అసాంఘీక శక్తులు పెరిగాయి. సరూర్‌నగర్‌లో వెస్ట్ బెంగాల్‌ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. కేసులో పట్టుబడిన ఇద్దరు బెంగాల్‌ యువకులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ(Telangana)లోని హైదరాబాద్‌(Hyderabad) అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మెట్రో సిటీ నుంచి గ్లోబల్‌ సిటీ(Global City)గా మారడంతో ఇక్కడి యువతను మత్తులో ముంచేస్తున్న డ్రగ్స్(Drugs)దందా ఓవైపు... ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చేస్తూ హైటెక్ స్టైల్లో నిర్వహిస్తున్న వ్యభిచారం (Prostitution) మరోవైపు. తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నప్పటికి అధికారులకు దొరకకుండా హైటెక్ ప్రాసెస్‌లో ఈ వ్యభిచారం నడుస్తోంది. సరూర్‌నగర్‌(Saroor Nagar)డివిజన్ అనీల్‌కుమార్‌ కాలనీ(Anilkumar Colony)లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం(Monday)పోలీసులు అరెస్ట్ చేశారు.ఏమాత్రం అనుమానం రాకుండా అంతా ఆన్‌లైన్‌(Online)లోనే సాగుతున్న ఈ దందాపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రైడ్ చేశారు. అనీల్‌కుమార్‌ కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొనున్న నిర్వాహకులు అందులో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ మురికి వ్యాపారం చేస్తుంది ఇక్కడి వాళ్లు కాదని పోలీసులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన 31సంవత్సరాల సాగర్‌ మొండల్(Sagar Mondal)అలియాస్ బిల్లుతో పాటు రోహన్ మండల్(Rohan Mondal)అనే మరో 22ఏళ్ల యువకుడు ఈదందాని నిర్వహిస్తూ పట్టుబడ్డారు. అంతే కాదు వ్యభిచారం కోసం అమ్మాయిలను కూడా పశ్చిమ బెంగాల్‌(West Bengal)నుంచే తీసుకొస్తున్నారని పోలీసులు తమ విచారణలో రాబట్టారు.

హైటెక్‌ స్టైల్లో వ్యభిచారం..

వెస్ట్ బెంగాల్‌లోని నిరుద్యోగ అమ్మాయిలకు ఉద్యోగాలిప్పిస్తామని ఆశ చూపించి ఇక్కడికి పిలిపిస్తున్నారు. అటుపై డబ్బు ఆశ చూపించి వ్యభిచార రొంపిలో దించినట్లుగా తేల్చారు. ఇక విటులను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో బిజినెస్ చేస్తున్నారు. ఓ వెబ్‌సైట్‌లో అమ్మాయిల ఫోటోలను పెట్టి కస్టమర్ల ద్వారా మనీ ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని అమ్మాయిలను సప్లై చేస్తున్నారని తేలింది.

వెస్ట్ బెంగాల్‌ యువకుల పనే..

హైటెక్ ప్రాసెస్‌లో జరుగుతున్న ఈ వ్యభిచార దందాలో సాగర్‌ మండల్ అలియాస్ బిల్లు, రోహన్ మండల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లతో పాటు వారికి సహాకరిస్తున్న మరో ముగ్గుర్ని డిసెంబర్‌లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు సరూర్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

ఇకపై పీడీ యాక్టేనట..

రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సర్కారు వ్యభిచారం అరికట్టడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జంటనగరాల పరిధిలో ఎక్కడ వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడినా వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్‌ లాంటి కఠినమైన సెక్షన్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు.

Published by:Siva Nanduri
First published:

Tags: Greater hyderabad, Prostitution racket

ఉత్తమ కథలు