తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 2020, మే 1వ తేదీ శుక్రవారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలుగా నమోదైంది. మే 2 వ తేదీ శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షపాతం కూడా సంభవించే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.