హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad weather : నగరంలో చలి పులి.. రికార్డు స్థాయిలో చలి తీవ్రత.. నగరంలో యెల్లో అలర్ట్...

Hyderabad weather : నగరంలో చలి పులి.. రికార్డు స్థాయిలో చలి తీవ్రత.. నగరంలో యెల్లో అలర్ట్...

చలి తీవ్రతతో ప్రజలు మంటల చుట్టూ చేరి చలి కాసుకున్నారు. ప్రస్తుతం ఉత్తర, వాయువ్య భారతదేశంపై చలిగాలులు ప్రభావం ఉంది. పశ్చిమం నుంచి అతివేగంతో కూడిన మంచు గాలుల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ప్రాంతీయ వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి చెప్పారు.

చలి తీవ్రతతో ప్రజలు మంటల చుట్టూ చేరి చలి కాసుకున్నారు. ప్రస్తుతం ఉత్తర, వాయువ్య భారతదేశంపై చలిగాలులు ప్రభావం ఉంది. పశ్చిమం నుంచి అతివేగంతో కూడిన మంచు గాలుల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ప్రాంతీయ వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి చెప్పారు.

Hyderabad weather : హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా చలి పులి పంజా విసురుతుంది. సాధారణ సరాసరి ఉష్ణోగ్రతలకంటే రెండు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతోంది. ఇలా మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్టు వాతవరణ శాఖ తెలిపింది..

  హైదరాబాద్ నగరంలో చలికి వణికిపోతుంది. శీతల ప్రాంతాల్లో చలి మాదిరిగా హైదరాబాద్ నగరం మారిపోయింది. అక్కడి ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.. ఒక్కసారిగా నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉండనున్నట్టు వాతరణ శాఖ అంచనా వేస్తోంది.

  కాగా నగరంలో కనీస ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీ సెల్సియ‌స్‌గా న‌మోదు అయింది. ఇది సాధార‌ణం కంటే 2 డిగ్రీలు త‌క్కువ‌. మ‌రో నాలుగు అయిదు రోజుల‌ వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. మ‌రో 3 నుంచి 4 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని.. అలాగే గంట‌కు ఆరు నుంచి ఎనిమిది కిలోమీట‌ర్ల వేగంతో చ‌ల్ల‌ని గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావర‌ణ శాఖ తెలిపింది.

  TRS@Delhi : ఢిల్లీకి చేరిన మంత్రుల బృందం.. మూడు రోజులు అక్కడే మకాం..ఇసారి ఏం జరుగుతుందో..?


  కాగా నేడు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో 10 డిగ్రీల‌ లోపే ఉష్ణోగ్ర‌త న‌మోదు అయినట్టు తెలిపింది..ఇక నగరంలోని సంగారెడ్డిలో 6.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డంతో అది గ‌త 10 ఏళ్ల‌ కంటే అత్య‌ల్పంగా న‌మోదు అయింది. దీంతో వాతావ‌ర‌ణ శాఖ డిసెంబ‌ర్ 21 వ‌ర‌కు న‌గ‌ర వ్యాప్తంగా ఎల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. అలాగే.. ఆదిలాబాద్, రాజ‌న్న సిరిసిల్ల‌, జ‌గిత్యాల‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల‌కు వ‌చ్చే కొన్ని రోజుల వ‌ర‌కు ఆరెంజ్ వార్నింగ్‌ను వాతావార‌ణ శాఖ జారీ చేసింది.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Weather report

  ఉత్తమ కథలు