Home /News /telangana /

HYDERABAD WEATHER FORECAST SAYS THAT THE COMING THREE DAYS OF RAINS IN TELANGANA WILL INCREASE THE INTENSITY OF SUMMER SNR

Telangana: రాబోయే నాలుగు, ఐదు రోజుల్లో తెలంగాణలో ఆ పరిస్థితి తప్పదంట..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana Weather:తెలంగాణలో రాబోయే నాలుగు, ఐదు రోజుల విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కర్నాటక, తెలంగాణను ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఈనెల 26వ తేది వరకు రాష్ట్రంలో పలుచోట్ల వేసవి తీవ్రత కూడా భారీగా పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
రాబోయే వారం రోజుల పాటు తెలంగాణ(Telangana)లో వాతావరణం భిన్నంగా మారనుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే 42 నుంచి 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. వేసవి తాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనాన్ని కలిగించేలా హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ఓ చల్లని కబురు అందించింది. రాబోయే మూడ్రోజుల (3Days)పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు(Rains) కురుస్తాయని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగానే వాతావరణంలో ఇలాంటి మార్పు సంభవించే అవకాశమున్నట్లుగా వాతావరణకేంద్రం వెల్లడించింది. కర్నాటక, తెలంగాణను ఉపరితలద్రోణి ఆవరించి ఉన్నందుకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుగూణంగానే గురువారం(Thursday)సాయంత్రం హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. శుక్రవారం(Friday)సాయంత్రం రాష్ట్రంలోని నారాయణపేట (Narayanpeta),రంగారెడ్డి (Rangareddy),హైదరాబాద్‌(Hyderabad),వికారాబాద్‌, (Vikarabad), సంగారెడ్డి (Sangareddy) ,మెదక్‌ (Medak),మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) ,నాగర్‌కర్నూల్‌ (Nagarkurnool),నిజామాబాద్‌(Nizamabad), జగిత్యాల (Jagittala), మేడ్చల్‌ మల్కాజిగిరి (Medchal-Malkajigiri), సిద్దిపేట (Siddipeta)జిల్లాల్లో వర్షం కురిసింది.

రాష్ట్రంలో డిఫరెంట్‌ వెదర్..
ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో కూడా వాతావరణం కూడూ మేఘామృతమై ఉండటంతో కాస్త చల్లబడింది. అటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో 6.83, నందిగామలో 2.35, సంగారెడ్డిలో 1.80, పుట్టపహాడ్‌లో, రంగారెడ్డి జిల్లా కాసులబాద్‌లో 1.63 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. రాష్ట్రానికి ఈనెల 26వ తేది వరకు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మరోవైపు అకాల వర్షం కారణంగా ఆదిలాబాద్‌ జిల్లాలో విత్తనోత్పతి జొన్న నేలవాలింది. అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లిన పంట సైతం పూర్తిగా తడిసిపోయింది.

ఓవైపు వర్షాలు..మరోవైపు ఎండలు..
తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో 26వ తేది వరకు వర్షాలు కురుస్తాయని వెల్డిస్తూనే మరోవైపు వేసవి తీవ్రత కూడా దంచికొడుతుందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు మండిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఏడు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 14 జిల్లాల్లో 39 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. ములుగు జిల్లా మేడారం, వనపర్తి జిల్లా కేతేపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే ఐదు రోజులు ఈ వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana, Weather report

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు