Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు గమనిక.. నీటి సరఫరాలో అంతరాయం.. ఈ ప్రాంతాలకు అలర్ట్..

;ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ నగరానికి సరఫరా చేసే గోదావరి నీటిని శుద్ధి చేసే తొమ్మిది పంపులు నీటిలో మునిగిపోయాయి. ఈ పంప్ హౌస్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది.

  • Share this:
    తెలంగాణ గత మూడు రోజులుగా పలుచోట్ల భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజులు ఇబ్బంది పడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చిన్నకోడూరు మండలంలోని మల్లారం గ్రామంలో గల హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజి బోర్డ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని 6.6 KV పంప్ హౌజ్(Mallaram pump house) నీటి మునిగింది. హైదరాబాద్ నగరానికి సరఫరా చేసే గోదావరి నీటిని శుద్ధి చేసే తొమ్మిది పంపులు నీటిలో మునిగిపోయాయి. ఈ పంప్ హౌస్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే పంప్ హౌస్ నీట మునిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు మెట్రోపాలిటన్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS & SB) ఒక ప్రటకన విడుదల చేసింది. 48 గంటల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుందని వాటర్ బోర్డ్ సోమవారం తెలిపింది.

    మల్కాజిగిరి, శెరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, బాచుపల్లిలలో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్టు వాటర్ బోర్డు తెలిపింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామని వాటర్ బోర్డ్ వెల్లడించింది. ప్రజలు సహాయం కోసం HMWS & SB కస్టమర్ కేర్ నంబర్ 155313 ఫోన్ చేయవచ్చని తెలిపింది.





    ఇక, వరద నీట మునిగిన పంప్ హౌజ్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు(Harish Rao), హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజి బోర్డ్ ఎండీ దాన కిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. సోమవారం వేకువ జామున మునుపెన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లా లో 4 గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. పంప్ హౌజ్ నీట మునకతో హైదారాబాద్ డ్రింకింగ్ వాటర్‌తో పాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని 1950 హబిటేషన్లకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని ఆయన తెలిపారు.

    హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజి బోర్డ్ ఎండీ దాన కిషోర్(Dana Kishore) నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒకటి నుంచి రెండు రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిస్టోరేషన్ చర్యలు చేపడతామని హరీష్ రావు చెప్పారు. రెండు నుంచి మూడు రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన రిస్టోరేషన్ చర్యలు చేపడతామన్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో తాగునీటి పంపింగ్ చేపడతామని వెల్లడించారు. పంప్ హౌజ్ నీట మునకతో త్రాగునీటి సరఫరా లో ఎదురయ్యే తాత్కాలిక అడ్డంకులను అధిగమించేందుకు హిమాయత్ సాగర్, గండి పేట, ఉస్మాన్ సాగర్, సింగూరు నుంచి హైదారాబాద్‌కు త్రాగునీటి సరఫరా పెంచుతామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: