• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD WATER PROJECT FIGHT BETWEEN TELANGANA AND ANDHRA PRADESH MLA ROJA SLAMS TRS MINSTER VEMULA PRASANTH REDDY NGS

MLA Roja: ఏపీ ప్రజలు రాక్షసులా..? మంత్రికి ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ మంత్రి పై రోజా ఫైర్

నిన్నటి వరకు సఖ్యతగా ఉన్న టీఆర్ఎస్-వైసీపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేరుగా సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.

  • Share this:
    ఏపీ-తెలంగాణల మధ్య జల వివాదం ముదురుతోంది. మొన్నటి వరకు తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ భాయ్ భాయ్ అనుకున్నాయి. దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసి నిర్ణయాలు తీసుకున్నాయి.. రెండు రాష్టాల్లో ప్రభుత్వాల మద్య అవగాహన అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ అన్నట్టు వ్యవహారం ముదురుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆనాటి సీఎం వైఎస్ఆర్ నీటి దొంగ అయితే.. నేటి సీఎం జగన్ గజ దొంగ అంటూ మండిపడ్డారు. దీంతో వైసీపీ నేతలంతా టీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా సైతం ఘాటుగా స్పందించారు..

    ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని రోజా మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని, అక్రమ ప్రాజెక్టులనీ మాట్లాడటం సరికాదన్నారు.

    ఇదీ చదవండి: మావోయిస్టులపై కరోనా పంజా.. అగ్రనేత జగన్ మృతి..! మరో ఆరుగురికి వైరస్!

    ఏపీలో ప్రజలందరికీ దేవుడిలా మారిన జగన్ ను అంత మాట అనడం సరైంది కాదని వైసీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదని.. కేటాయింపులే లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోందని. 8 అక్రమ ప్రాజెక్టుల ద్వారా 178 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన వైఎస్సార్‌ను తూలనాడటం తెలంగాణ మంత్రులు, నాయకులను మంచిది కాదని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మహానేత ప్రాజెక్టులు చేపట్టారని. అందుకే ఆయన్ను అన్ని ప్రాంతాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని దేవుడిగా కొలిచారు. ముఖ్యమంత్రి జగన్‌ పారదర్శకతతో వ్యవహరిస్తున్నారని. రాష్ట్రానికి లేని కేటాయింపులను వాడుకోవాలని భావించడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకొనే యోచన తమ రాష్ట్రానికి లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: మోదీకి వ్యతిరేకంగా జగన్ వెళ్తారా? స్టాలిన్ లేఖపై సీఎం స్పందిస్తారా
    Published by:Nagesh Paina
    First published: