BJP Vs BRS Flexi War in Hyderabad: తెలంగాణ పాలిటిక్స్ రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వార్ నడుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ విచారించింది. అయితే అదే రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో మరోసారి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ తారాస్థాయికి చేరింది.
కాగా రాష్ట్రంలో ఫ్లెక్సీల లొల్లి కొత్తేమి కాదు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు..బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపుతోంది. అయితే ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ రోజే అమిత్ షా తెలంగాణ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం CISF రైజింగ్ డే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలో 'Whasing Powder Nirma' పేరుతో Welcome To Amit Shah అంటూ పేర్కొన్నారు. ఇక ఈ ఫ్లెక్సీలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన నేతలతో కూడిన పోస్టర్ వెలిసింది. కాగా నిన్న టైడ్ పేరుతో పోస్టర్లు వెలవగా..ఇవాళ వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో హోర్డింగులు వెలవడం కలకలం రేపుతోంది.
Amid ongoing questioning of BRS MLC K Kavitha in the Delhi liquor case, another poster featuring leaders who joined BJP from other parties is seen in Hyderabad as Union Home Minister Amit Shah attends the CISF Raising Day event in the city today pic.twitter.com/5fIi0az6Zq
— ANI (@ANI) March 12, 2023
ఈ ఫ్లెక్సీలో హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రానే, సువెందు అధికారి, సుజనా చౌదరి, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింద్య, అర్జున్ కోట్ కర్ సహా పలువురు నేతల ఫోటోలను వాషింగ్ పౌడర్ నిర్మా ఫోటో స్థానంలో కేవలం తలను ఉంచి అమిత్ షాకు వెల్ కమ్ చెబుతున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.