HYDERABAD VISIT THESE MOST MAGICAL WATERFALLS NEAR HYDERABAD IN TELANGANA THIS MONSOON BK PRV
Best tourist place: ఈ సీజన్లో హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ మిస్ కావొద్దు..
ప్రతీకాత్మక చిత్రం
వర్షాన్ని ఎంజాయ్ చేసే వాళ్లు ఈ సీజన్ (Monsoon) లో కనిపించే వాటర్ ఫాల్స్ (Water Falls)ని కూడా అంతే లవ్ చేస్తారు. హైదరాబాదు (Hyderabad) నుండి కేవలం ఆరు గంటల కంటే తక్కువ దూరంలో ఉన్న కొన్ని అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
గత కొద్ది రోజులుగా తెలంగాణ (Telangana) వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తోన్నాయి. అయితే వర్షాన్ని ఎంజాయ్ చేసే వాళ్లు ఈ సీజన్ (Monsoon) లో కనిపించే వాటర్ ఫాల్స్ (Water Falls)ని కూడా అంతే లవ్ చేస్తారు. అలాంటి వాళ్ల కోసం న్యూస్ 18 హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న అందమైన వాటర్ ఫాల్స్ గురించిన సమాచారం అందిస్తోంది. హైదరాబాదు (Hyderabad) నుండి కేవలం ఆరు గంటల కంటే తక్కువ దూరంలో ఉన్న కొన్ని అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సప్తగుండల వాటర్ ఫాల్స్ :
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌లోని (Asifabad) జిల్లాలో ఉన్న అందమైన వాటర్ ఫాల్స్ లో సప్తగుండల వాటర్ ఫాల్ (Saptagundala Waterfall), ఒకటి. ఒకే ప్రాంతంలో ఏడు వాటర్ ఫాల్స్ ఉండడం ఇక్కడ విశేషం. ఈ వాటర్ ఫాల్ ఎత్తైన కొండలు దట్టమైన అడవుల మధ్య ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి 3 కి.మీ దూరం వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్లకు ఇది సరైన వికెండ్ స్పాట్ అని చెప్పోచ్చు. ఈ అందమైన జలపాతం హైదరాబాద్ నుండి 252 కి.మీ దూరంలో ఉంది.
కుంటాల వాటర్ ఫాల్స్:
తెలంగాణలోని ఎత్తైన జలపాతం కుంటాల వాటర్ ఫాల్ (Kuntala Waterfall) ఒకటి, అడ్వెంచర్ ఇష్టపడే వాళ్లకు ఇది సరైన ప్రాంతం, ఈ ప్రదేశం హైకింగ్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ నీరు 200 అడుగుల ఎత్తు నుండి రాళ్ల ద్వారా ప్రవహించే దృశ్యం అద్చుతంగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ హైదరాబాద్ నుండి 270 కి.మీ దూరంలో ఉంది.
బోగత జలపాతం..
హైదరాబాద్ నుంచి కేవలం ఐదు గంటల ప్రయాణంలో ఉన్న ములుగు జిల్లాలోని బొగత వాటర ఫాల్ (Bogata Waterfall) ఉంటుంది. ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జలపాతం. ఈ వాటర్ ఫాల్ కు తెలంగాణ నయాగరా అనే పేరు కూడ ఉంది. వర్షకాలంలో ఈ వాటర్ ఫాల్ కు సందర్శకుల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ వాటర్ ఫాల్ ను సందర్శించడానికి సరైన సమయం జూన్ నుండి నవంబర్ వరకు సరైన సమయం. ఈ వాటర్ ఫాల్ హైదరాబాద్ నుండి 277.3 కి.మీ దూరంలో ఉంది.
బోగత జలపాతం
ఎత్తిపోతల వాటర్ ఫాల్..
నాగార్జున సాగర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం (Athiputala Waterfall) అద్భుతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. నక్క వాగు, తుమ్మల వాగు, చంద్రవంక వాగు అనే మూడు వాగులు కలిసి ఈ అందమైన జలపాతంగా ఏర్పడ్డాయి. దీంతోపాటు ఈ జలపాతం దిగువన మొసళ్ల పెంపకం కేంద్రం కూడా ఉంది ఎప్పుడైన మీరు ఇక్కడకు వెళ్లత్తే ఈ వాటర్ ఫాల్ ను తప్పకుండా సందర్శించండి. ఈ జలపాతం హైదరాబాద్ నుండి 163 కి.మీ దూరంలో ఉంది.
మల్లెల తీర్థం జలపాతం..
మల్లెల తీర్థం వాటర్ ఫాల్ (Mallela Theertham Waterfall) దట్టమైన నల్లమల అడవుల్లో ఉంది. జలపాతం ఎత్తు దాదాపు 150 అడుగులు ఉంటుంది. వేసవిలో ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ, సంవత్సరం పొడవునా ఈ ప్రదేశం లో అందమైన జలపాతం కనువిందు చేస్తోంది. అయితే ముఖ్యంగా వర్షకాలంలో అయితే ఈ జలపాతాన్ని చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. రివర్ క్రాసింగ్‌లు, ట్రెక్కింగ్, స్లైడింగ్ క్యాంప్ఫైర్లకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఈప్రాంతం హైదరాబాద్ నుండి 185 కి.మీ దూరంలో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.