హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Chaturthi: ఈ వినాయ‌క మండపంలో గ‌ణేశుడి బ్యాటింగ్.. ఎలుక బౌలింగ్.. ఎక్క‌డో తెలుసా?  

Ganesh Chaturthi: ఈ వినాయ‌క మండపంలో గ‌ణేశుడి బ్యాటింగ్.. ఎలుక బౌలింగ్.. ఎక్క‌డో తెలుసా?  

క్రికెట్ ఆడుతున్నట్లు ఉన్న గణేశ్​, ఎలుక విగ్రహాలు

క్రికెట్ ఆడుతున్నట్లు ఉన్న గణేశ్​, ఎలుక విగ్రహాలు

కోవిడ్ త‌రువాత వ‌చ్చిన వినాయ‌క చ‌వితి కావడంతో ఈ ఏడాది భారీ సంఖ్య‌లో వినాయ‌క మండ‌పాలు సిటీలో వెలిశాయి. ప్ర‌తి గ‌ల్లిలో ఒక వినాయ‌క మండ‌పం వెలిసింది. ప్ర‌తి వినాయ‌కుడు ఒక‌దానిని మించి మ‌రోక‌టి ఉంటున్నాయి హైద‌రాబాద్ లో..

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (Balakrishna, News18, Hyderabad)

  వినాయ‌క చ‌వితి (Vinayaka Chaviti) వ‌చ్చిందంటే హైద‌రాబాద్ (Hyderabad)లో ఎలాంటి హాడ‌విడి ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వివిధ రూపాల్లో వినాయ‌కులు ద‌ర్శ‌మిస్తారు. ఏ గ‌ల్లి చూసిన ప్ర‌త్యేక‌మైన వినాయ‌క విగ్ర‌హాల‌తో అందంగా అలంక‌రించిన మండ‌పాలు ద‌ర్శ‌మిస్తాయి. కోవిడ్ త‌రువాత వ‌చ్చిన వినాయ‌క చ‌వితి కావడంతో ఈ ఏడాది భారీ సంఖ్య‌లో వినాయ‌క మండ‌పాలు సిటీలో వెలిశాయి. ప్ర‌తి గ‌ల్లిలో ఒక వినాయ‌క మండ‌పం వెలిసింది. ప్ర‌తి వినాయ‌కుడు ఒక‌దానిని మించి మ‌రోక‌టి ఉంటున్నాయి హైద‌రాబాద్ (Hyderabad) లో.. మొన్న‌టికి మొన్న కొబ్బ‌రి చిప్ప‌ల‌తో వినాయ‌కుడిని ఏర్పాటు చేస్తే ఇప్పుడు గ‌ణేషుడు క్రికేట‌ర్ అవ‌తారమెత్తాడు. వినాయ‌క చ‌వితికి ఒక్క హైద‌రాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రకాల గణేష్ విగ్రహాలు దర్శనమిస్తాయి. భారీ గణేశ విగ్రహాలు అన్ని సిటీల్లోను ద‌ర్శ‌మిస్తాయి. అయితే ఇప్పుడు పర్యావరణ అనుకూలమైన గణేశ విగ్రహాల ఏర్పాటు చేయ‌డానికి నిర్వ‌హుకులు పోటీ ప‌డుతున్నారు ఇందులో విభిన్న రూపాల్లో వినాయ‌కుల‌ను పెట్ట‌డానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపిస్తున్నారు. అందుకే ఈ వినాయ‌కులు భ‌క్తుల‌ను కూడా ఆక‌ర్షిస్తున్నాయి.

  అయితే అలాంటి ప్ర‌త్యేక‌మైన విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయ‌కులు ఈ ఏడాది హైదరాబాద్ లోకూడా భారీగానే ఏర్పాటు చేశారు ప‌లువురు నిర్వ‌హుకులు. అయితే, విభిన్నమైన గ‌ణేష్ విగ్ర‌హాలు ఏర్పాటు చేయ‌డంలో బేగంబజార్ (Begum Bazar) కు చాలా ప్ర‌సిద్ది ఉంది. గ‌త రెండేళ్లు కోవిడ్ కార‌ణంగా వినాయ‌క చ‌వితి పెద్ద‌గా చేసుకోక‌పోయిన ఈ ఏడాది మాత్రం సాధారణ ప‌రిస్థితుల మాదిరిగానే గ‌ణేశ్​ మండ‌పాలు వెలిశాయి .ఇక్క‌డ‌ వివిధ రకాల గణేష్ విగ్రహాలు కు మాత్ర‌మే కాదు వాటిని అలంకరణలకు ప్రసిద్ధి. ఇలా ప్ర‌త్యేకంగా అలంక‌రించిన విగ్రహాల‌ను చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు బేగంబజార్ కు వస్తున్నారు.

  అయితే ఈ ఏడాది  బాల్ యువ మండల్ బేగంబజార్ హిందీ నగర్‌లోని ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ గణేష్ విగ్రహం (Box cricket Ganesh Statue) ఇప్పుడు భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్క‌డ గ‌ణేషుడిని క్రికెటర్​ అవ‌తారంలో ఏర్పాటు చేశారు. పిచ్ పై క్రికెట్ (Cricket) బ్యాట్ ప‌ట్టుకొని నిల‌బ‌డి ఉన్న వినాయ‌కుడి విగ్ర‌హం ఇప్పుడు అంద‌ర్ని ఆక‌ర్షిస్తోంది.  “మేం ప్రతి సంవత్సరం వివిధ రకాల గణేష్ విగ్రహాలను ప్రతిష్టిస్తాం. అయితే గ‌త రెండు సంవ‌త్స‌రాలు పెద్ద‌గా కోవిడ్ వ‌ల‌న ఏర్పాటు చేయ‌లేదు కానీ ఈ సంవత్సరం ఈ బాక్స్ క్రికెట్ థీమ్‌తో ముందుకు వచ్చాం. మేం ఏర్పాటు చేసిన విగ్ర‌హాం క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు. గణేష్ బ్యాటింగ్ చేస్తున్నాడు, ముషాక్ (మౌస్) బౌలింగ్ Mouse Bowling) చేస్తున్నాడు. నంది అంపైర్‌ (Nandi Umpire)గా ఉన్నారు. వీకెండ్‌ కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు సెలవులు కావడంతో ఎక్కువ మంది సందర్శిస్తున్నారని న్యూస్ 18 కి తెలిపారు గణేష్ పండల్ నిర్వాహకుడు ఆకాష్ అగర్వాల్.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ganesh Chaturthi​ 2022, Hyderabad

  ఉత్తమ కథలు