Vijayashanthi on kcr : తన ప్రయోజనాల కోసమే లాక్డ్‌న్ ఎత్తివేసిన సీఎం

Vijayashanthi on kcr : తన ప్రయోజనాల కోసమే లాక్డ్‌న్ ఎత్తివేసిన సీఎం

Vijayashanthi on kcr : తెలంగాణ ప్రజలను అమయాకులను చేసి సీఎం కేసిఆర్ ఓ ఆట ఆడుకుంటున్నారని బిజెపి నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కాని ప్రజలు మాత్రం వెర్రివాళ్లు కాదని సమయం వచ్చినప్పుడు బుద్ది చెబుతారని అన్నారు.

  • Share this:
ముఖ్యంగా తన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకే సీఎం కేసిఆర్ లాక్‌డౌన్ ఎత్తివేశారని విజయశాంతి విమర్శించారు. పక్కరాష్ట్రాల్లో ఇంకా లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతుంటే..తెలంగాణలో మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేసి మరోసారి ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారని అన్నారు.

దీంతో సీఎం కేసిఆర్ లాక్డౌన్ ఎందుకు ఎత్తివేశాడో అందరికి అర్థం అవుతుందని అన్నారు. పక్కరాష్ట్రాల్లో ఇంకా లాక్డౌన్ కొనసాగుతుందని అయినా..తెలంగాణలో జిల్లాల పర్యటనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. మరోవైపు దత్తత గ్రామాల్లో వేలాది మందితో సాముహిక భోజనాలు కూడా చేయనున్నారని మండిపడ్డారు. అందుకోసమే లాక్‌డౌన్ ఎత్తివేశారని అర్థం అవుతుందని అన్నారు.ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

నిన్నటి వరకు కరోనా ఉందంటూ లాక్‌డౌన్ విధించి ఒక్కసారిగా ఎలాంటీ నిబంధనలు లేకుండా పూర్తి స్థాయిలో ఎత్తివేశారని మండిపడ్డారు. తన కార్యక్రమాల కోసం హడావుడిగా లాక్‌డౌన్ ఎత్తివేశారని, కాని కేసులు తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారమే లాక్‌డౌన్ ఎత్తివేసినట్టు చెబుతున్నారని అన్నారు.

మరోవైపు విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి జులై నుండి అన్ని విద్యాసంస్థలను రీ ఒపెన్ చేస్తామని ప్రకటించారని ఫైర్ అయ్యారు. మూడో వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నా..సీఎం కేసిఆర్ పట్టించుకున్నట్టు కనిపించడం లేదని అన్నారు.

ఇక పొరుగున ఉన్న రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయని , ముఖ్యంగా మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా వేరియంట్ ప్రభావం ఉండగా..తమిళనాడు కర్ణాటకలో లాక్‌డౌన్ పొడగించారని గుర్తుచేశారు. కాని తెలంగాణలో పాలకులు మాత్రం తమ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పాలకుల వ్యవహరశైలి వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Published by:yveerash yveerash
First published: