హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Crime news : ఖాకీ వనంలో కామాంధులు .. జాబ్ ఇప్పిస్తానంటూ యువతిపై ఎస్‌ఐ అరాచకం

Telangana | Crime news : ఖాకీ వనంలో కామాంధులు .. జాబ్ ఇప్పిస్తానంటూ యువతిపై ఎస్‌ఐ అరాచకం

(Criminal SI)

(Criminal SI)

Telangana: లైంగిక వేధింపులకు పాల్పడే అధికారులకు పాల్పడుతూ కొందరు పోలీసులు డిపార్ట్‌మెంట్‌కే అపకీర్తి తెస్తున్నారు. వివాహితలు, యువతులను తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనుభవించడమే కాకుండా ..బ్లాక్‌మెయిల్ చేస్తూ కామాంధులుగా మారిపోతున్నారు. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాలో మరో అధికారి ఇలాంటి దురాగతానికే పాల్పడి వార్తల్లో నిలిచాడు.

ఇంకా చదవండి ...

తెలంగాణ పోలీసుశాఖ(Telangana police)లో పని చేస్తున్న కొందరు కామాంధుల్లో ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మొన్న మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాస్(Maredpally CI Srinivas)..నిన్న మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐ(Malkajgiri CCS SI) ధరావత్‌ విజయ్‌కుమార్‌(Dharawat Vijaykumar)..ఇవాళ కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ (Komurambhim Asifabad)జిల్లాలో మరో సబ్‌ ఇన్స్‌పెక్టర్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆడవాళ్లు, యువతుల పట్ల కామపిశాచాల్లా తయారయ్యాయి. తమ శారీరక కోరిక తీర్చమని లేదంటే చంపేస్తామని లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న పోలీసుల జాబితాలో మరొకరి పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది.

Rajannasircilla: నక్కవాగుతో అక్కడి జనానికి పెద్ద చిక్కొచ్చె .. వంతెన కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపుమూడో కామాంధుడు..

గత రెండ్రోజులుగా ఇద్దరు పోలీసు అధికారుల రసిక రహస్యాలు బయటపడుతున్న సమయంలోనే మరో పోలీస్ అధికారి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోలీస్ ఇద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతికి ట్రాప్ చేశాడు. ఆమెకు ఎస్‌ఐ ఫోన్ చేసి పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించుకొని ఉద్యోగానికి అవసరమై మెటిరియల్స్, పుస్తకాలు ఇస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అంతే కాదు బాధిత యువతికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చేలా చూస్తానంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

కాప్స్‌లో కామోన్మాదులు..

ఖాకీ డ్రెస్‌ వేసుకున్న కామాంధుడి టార్చర్ భరించలేక ..అతను చెప్పినట్లు చేయడం ఇష్టం లేని యువతి విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పుకుంది. ఈ నేపథ్యంలో వారంతా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐపై గతంలో కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలిసింది. యువతి ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పాటు వాళ్లు చూపించిన ఆధారాల ప్రకారం ఎస్‌ఐని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

First published:

Tags: Police arrest, Telangana crime news

ఉత్తమ కథలు