Vice President: అన్ని ఫ్రీ.. ఫ్రీ.. అంటే ఎలా.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు.. మధ్యాహ్నం చేప ఫ్రీగా ఇస్తే..

సభలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vice President Venkaiah Naidu) ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు అందజేసే ఉచిత పథకాలపై (Free Schemes) ఆయన పరోక్షంగా మాట్లాడారు.  ప్రజల్లో సోంబేరి తనాన్ని పోత్సహించకూడదని అన్నారు.

 • Share this:
  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vice President Venkaiah Naidu) ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు అందజేసే ఉచిత పథకాలపై (Free Schemes) ఆయన పరోక్షంగా మాట్లాడారు.  ప్రజల్లో సోంబేరి తనాన్ని పోత్సహించకూడదని అన్నారు. అది ఫ్రీగా ఇస్తాం.. ఇది ఫ్రీగాఇస్తామని చెబుతున్నారు. ప్రభుత్వాలు.. ప్రజలను చైతన్య వంతులను చేయాలే గానీ ఫ్రీ.. ఫ్రీగా అంటూ కూర్చొబెడితే ఎలా అంటూ ప్రశ్నించారు. చేపలు పట్టడం నేర్పించాలి కానీ… ఉచితంగా చేప ఇస్తే ఎలా..? అని అన్నారు. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఆదివారం ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురించిన నర్సరీ రాజ్యానికి రారాజు (Nursery Rajyaniki Raraju) – పల్ల వెంకన్న పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

  ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరు ఉచిత కరెంట్ (Free Power) గురించి మాట్లాడవద్దని చెప్పారు. మాట్లాడితే పార్టీకి నష్టం వస్తుందన్నారు. ఫ్రీ పవర్ అంటే ముందు లో పవర్, తర్వాత నో పవర్. నో పవర్ అంటే కేవలం ఫ్రీ పవరే.. అసలు పవరే లేకపోతే బిల్లు ఏమస్తుంది. ప్రజలను చైతన్య వంతులను చేసి, పని నేర్పించి, స్కిల్ పెంచి.. ప్రోత్సహాన్ని కల్గించి పైకి వచ్చేలా చేయాలి. కింద ఉన్నవాళ్లు పైకి రావాలంటే చేయి పట్టుకుని అందించాలి. అంతేకాని కింద ఉన్నవాళ్లను ఎత్తుకుంటే.. సాయంత్రం తర్వాత భుజం మీద నుంచి దించమాకండి సారు.. ఇదే కంఫర్ట్‌గా ఉందని అంటాడు. ఈ ధోరణిలో మనం ముందుకెళ్తున్నాం. ఇది ఏమాత్రం మంచిది కాదు.

  ఏపీ సీఎం YS Jagan ఎన్డీయేలో చేరాలి.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు..

  పెద్దవాళ్లు చెప్పేవాళ్లు.. చేపను పట్టుకోవడం నేర్పించు, కానీ చేపను ఉచితంగా ఇవ్వడం చేయమాకు అని. మధ్యాహ్నం మట్ట గుడిసె ఉచితంగా ఇస్తే.. సాయంత్రం కొర్రమీను కావాలంటాడు. అది గుర్తుపెట్టుకో. కొర్రమీను ఇవ్వకపోతే అసంతృప్తి మొదలవుతుంది’అని అన్నారు. కష్టపడటం, ఇష్టపడటం చేసి.. నష్టపడిపోకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

  Shirdi Tour Package: షిర్డీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. ప్రకటించిన టీఎస్‌టీడీసీ.. వీటిని కూడా చూసేయచ్చు.. చార్జీలు ఇవే..

  అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా పలు రాష్ట్రాలు పలు ఉచిత పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఉచిత పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ముందు దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం.. ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా హామీల వర్షాలు కురిపిస్తున్నాయి. వాటిలో ఫ్రీ స్కీమ్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. చాలా మంది జనాలు కూడా ఫ్రీ స్కీమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

  ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. వెంకయ్యనాయుడు
  ఈ పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రకృతిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా యువత ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విచ్చలవిడిగా చెట్టు నరకడం వల్ల భూతాపం విపరీతంగా పెరిగిపోతోందని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ అసమతౌల్యత ప్రకృతి విపత్తులకు కారణం అవుతున్నదని తెలిపారు. పర్యావరణం – ప్రగతిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని చెప్పారు. దేశమంతా తిరిగి దాదాపు మూడువేల రకాల మొక్కల్ని సేకరించి నర్సరీని అభివృద్ధి చేసిన వెంకన్న, ప్రతి ఇంట్లో పచ్చదనాన్ని పెంచడం ద్వారా దేశమంతా పచ్చదనాన్ని పెంచవచ్చని ఆకాంక్షించారని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: