హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Nimajjanam 2022: వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ .. 24లక్షల 60వేలు దక్కించుకుంది ఎవరంటే

Ganesh Nimajjanam 2022: వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ .. 24లక్షల 60వేలు దక్కించుకుంది ఎవరంటే

(Photo Credit:Face Book)

(Photo Credit:Face Book)

Hyderabad: ఈసారి బాలాపూర్‌ లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. బంగారు లడ్డూను వ్యాపారి వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో 24లక్షల 60వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 29సారి జరిగిన వేలంలో లడ్డూ ప్రసాదాన్ని కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డికి అందజేసారు. తాను ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష్మారెడ్డి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బాలాపూర్‌ లడ్డూ(Balapur laddu)వేలంలో భారీ ధర పలికింది. బంగారు లడ్డూను వ్యాపారి వంగేటి లక్ష్మారెడ్డి(Vangeti Lakshmareddy) దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో 24లక్షల 60వేల(24 lakhs 60 thousand)కు లడ్డూను దక్కించుకున్నారు. 29సారి జరిగిన వేలంలో లడ్డూ ప్రసాదాన్ని కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డికి అందజేసారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష్మారెడ్డి. లడ్డూ వేలం అనంతరం భారీ గణనాథుడి శోభయాత్రను ప్రారంభించారు. లడ్డూ వేలంలో గతంలో పాల్గొన్న వారితో పాటు మరో 9మంది కొత్తగా ఈ వేలంలో చేరారు.

Telangana politics : గవర్నర్‌ వ్యాఖ్యలపై TRSఫైర్ .. బీజేపీ ప్రతినిథిలా మాట్లాడుతున్నారు : కల్వకుంట్ల కవిత



5.7లక్షలు అధికం..
ముగ్గురు స్థానికులు ఉండగా ...ఆరుగురు స్థానికేతరులు లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 1994నుంచి గతేడాది వరకు అంటే 28సంవత్సరాల్లో లడ్డూ వేలం ద్వారానే బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది 18.9లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ ప్రసాదం ధర పలికింది. ఈసారి గతేడాది కంటే 5.7లక్షలు అధిక ధర పలకడంపై బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 20లక్షలు దాటుతుందనుకున్న బాలాపూర్ లడ్డూ ఏకంగా పాతిక లక్షలకు చేరువ వరకు వెళ్లింది.


బంగారు లడ్డూ వేలం..
ఇప్పటి వరకు 28ఏళ్లుగా బాలాపూర్‌ లడ్డూని వేలం వేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్య గతేడాది కాస్త తక్కువ ధర పలికినప్పటికి ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వేలం జరింది. మొట్టమొదటి సారిగా 1994 నుంచి బాలాపూర్‌లో గణేష్‌ లడ్డూ వేలంపాట కొనసాగూ వస్తోంది. బాలాపూర్‌ లడ్డూ వేలంపాట మొదట రూ.450తో ప్రారంభమైంది. ఆ తర్వాత 1995లో 4 వేల 500 లకు మళ్లీ ఆయనే అందుకున్నారు. ఆ తర్వాత కొలను కృష్ణారెడ్డి 1996 లో 18 వేలకు, 1997 లో 28 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 1998 లో మళ్లీ కొలను మోహన్‌రెడ్డి 51 వేలకు వేలం పాట పాడారు. 1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి 65 వేలకు దక్కించుకున్నారు. 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు వేలం పాట జరగగా.. 2002లో తొలిసారి వేలం పాట లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి లక్షా 5 వేలకు లడ్డూను అందుకున్నారు.

Telangana : సెంట్రల్ విస్టాలో ఖమ్మం బ్లాక్ గ్రానైట్ .. భారీ విగ్రహంతో భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు



28ఏళ్లుగా కొనసాగుతున్న వేలం ..
2003లో చిగురంత తిరుపతిరెడ్డి లక్షా 55 వేలకు, 2004లో మరోసారి కొలను మోహన్ రెడ్డి 2 లక్షల ఒక వేయికి లడ్డూను అందుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2 లక్షల 8 వేలకు, 2006లో చిగురంత తిరుపతి రెడ్డి 3 లక్షలకు, 2007లో జి.రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు, 2008లో కొలను మోహన్ రెడ్డి 5 లక్షల 7 వేలకు, 2009లో సరిత 5 లక్షల 10 వేలకు లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు. 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5 లక్షల 35 వేలకు, 2011లో కొలను బ్రదర్స్ 5 లక్షల 45 వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు. 2012లో పన్నాల గోవర్థన్ ఏడున్నర లక్షలకు దక్కించుకోగా.. 2013లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి తొమ్మిదిన్నర లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. 2015లో లడ్డూ ధర తొలిసారి 10 లక్షల దాటింది. కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు వేలంలో లడ్డూపు సొంతం చేసుకున్నారు. 2016లో స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేలకు, 2017లో నాగం తిరుపతి రెడ్డి వేలంలో 15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2018లో శ్రీనివాస్‌ గుప్తా 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Ganesh Chaturthi​ 2022, Hyderabad news

ఉత్తమ కథలు