హోమ్ /వార్తలు /తెలంగాణ /

అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి.. ఇంటికెళ్తూ వ్యక్తి మృతి..!

అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి.. ఇంటికెళ్తూ వ్యక్తి మృతి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా నుంచి తిరిగి వచ్చిన టెక్కీ తన భార్యతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అమెరికా నుంచి వచ్చి సొంతూరుకు వెళ్తూ.. ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నల్గొండ జిల్లాలో ఆదివారం జరిగిన కారు ఢీకొన్న ప్రమాదంలో 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ చనిపోయాడు. కారు రైలింగ్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన టెక్కీ తన భార్యతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) నుంచి ఏపీలోని గుంటూరు జిల్లాలోని వారి స్వగ్రామానికి వెళ్లేందుకు టెక్కీ తండ్రి.. దంపతులకు కారు ఏర్పాటు చేశారు.

వాహనం నల్గొండ చేరుకున్న తర్వాత డ్రైవర్ కరీముల్లా వాహనం అదుపు తప్పి రైలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు కాస్త నల్గొండ శివార్లలోని వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య, డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిద్దర్నీ వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అనంతరం డ్రైవర్‌ నిర్లక్ష్యమే తమ నష్టానికి కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి డెడ్ బాడీకి పోస్టుమార్టం జరిపి అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించనున్నారు. అమెరికా నుంచి తన బిడ్డ తిరిగి వస్తుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో... తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు