తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ...

కెటిఆర్ లాంటి సమర్థుడైన నేతతో కలిసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జోల్ రీఫ్ మాన్ పేర్కొన్నారు. అంతే కాదు హైదరాబాద్‌లో అమెరికా సంస్థల పెట్టుబడులు మరింత పెద్దమొత్తంలో వచ్చేందుకు ప్రభుత్వం తీసుకునే విధానాలను మంత్రి కేటీఆర్ జోయల్ రీఫ్ మన్ తో చర్చించారు.

news18-telugu
Updated: September 11, 2019, 11:29 PM IST
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ...
మంత్రి కేటీఆర్‌తో జోల్ రీఫ్‌మాన్ భేటీ (Twitter)
  • Share this:
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ జోల్ రీఫ్‌మాన్ బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అవకాశాలు, పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. కెటిఆర్ లాంటి సమర్థుడైన నేతతో కలిసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జోయల్ రీఫ్ మాన్ పేర్కొన్నారు. అంతే కాదు హైదరాబాద్‌లో అమెరికా సంస్థల పెట్టుబడులు మరింత పెద్దమొత్తంలో వచ్చేందుకు ప్రభుత్వం తీసుకునే విధానాలను మంత్రి కేటీఆర్ జోయల్ రీఫ్ మన్ తో చర్చించారు. అలాగే అమెరికా -భారత్ భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యే దిశలో తమ కృషి సాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు