హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: పసిపిల్లల కళ్ల ముందే ఘోరం.. భార్యను గొంతుకోసి చంపిన కిరాతక భర్త..

Hyderabad: పసిపిల్లల కళ్ల ముందే ఘోరం.. భార్యను గొంతుకోసి చంపిన కిరాతక భర్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uppal Murder: కట్టుకున్న భర్తే..కాల యముడిలా మారి.. భార్యను చంపేశాడు. పిల్లల కళ్ల ముందే గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌లో ఈ ఘోరం జరిగింది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  అనుమాన భూతం.. అదనపు కట్న దాహం.. పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. నిండు ప్రాణాలను తీసింది. కట్టుకున్న భర్తే..కాల యముడిలా మారి.. భార్యను చంపేశాడు. పిల్లల కళ్ల ముందే గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు, మృతురాలు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన కంది చంద్రయ్య కూతురుకు విద్య భారతి (33) అనే కూతురు ఉంది. 12 ఏళ్ల క్రితం ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. హైదరాబాద్‌లోని అంబర్ పేట ప్రాంతానికి చెందిన పుస్తకాల దీపక్(40)కి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహ సమయంలో భారీగా కట్న కానుకలు సమర్పించారు. ఐతే పెళ్లైన కొన్నేళ్ల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత దీపక్‌లోని అసలు రూపం బయటపడింది. భార్యపై అనుమానం పెరిగింది. అంతేకాదు అదనపు కట్నం కోసం వేధించేవాడు.


  వీరి కుటుంబం ప్రస్తుతం ఉప్పల్‌లోని కురుమనగర్‌లో నివసిస్తోంది. దీపక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. దివ్య భారతి ఓ కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తోంది. దివ్యభారతి, దీపక్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు ఐదో తరగతి చదువుతుండగా.. కూతురు మూడో తరగతి చదువుతోంది. భార్యాపిల్లాలతో సంతోషంగా ఉండాల్సింది పోయి.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు దీపక్. అదనపు కట్నం కోసం టార్చర్ పెట్టేవాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తన తండ్రితో కలిసి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది దివ్య భారతి. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఆమెను వేధించడని దీపక్ తల్లిదండ్రులు మాటిచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. కానీ ఇటీవల మళ్లీ అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎప్పటిలానే వేధింపులను కొనసాగించాడు. ఈ క్రమంలో భార్యా భర్తల విభేదాలు తారా స్థాయికి చేరాయి.

  దీపక్ గత 10 రోజులుగా ఇంటికి రావడం లేదు. శుక్రవారం రాత్రి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం అందరూ నిద్రపోయిన తర్వాత.. అర్ధరాత్రి సమయంలో భార్యపై దాడి చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో పిల్లలు కూడా నిద్రలేచారు. వారు చూస్తుండగానే.. దివ్య భారతిపై కత్తితో విరుచుకుపడ్డాడు దీపక్. గొంతుకోసి చంపేశాడు. ఇంట్లో శబ్ధాలు విని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూసే సరికి.. దివ్యభారతి రక్తపు మడుగులో పడి ఉంది. అదే సమయంలో పోలీసుల కళ్లు గప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు దీపక్. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీపక్‌పై పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్య భారతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతోనే దీపక్.. తన కూతురిని హత్య చేశాడని దివ్యభారతి తండ్రి చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మొదటి భార్యకు ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడని.. ఆ తర్వాత తమ కూతురిని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వాడిని వదిలిపెట్టవద్దని విజ్ఞప్తి చేశాడు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Hyderabad, Murder, Telangana

  ఉత్తమ కథలు