తెలంగాణలో కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఎవరినీ కరోనా వదలడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy)కి కూడా కరోనా (Corona positive) సోకింది. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
సన్నిహితంగా ఉన్న వారంతా..
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. బుధవారం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ (Home Quarantine)లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నాతో సన్నిహితంగా ఉన్న వారంతా ఐసోలేషన్లోకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి అంటూ రాసుకొచ్చారు. ఇక కిషన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Telangana BJP president Bandi Sanjay) స్పందించారు. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అన్న అంటూ కామెంట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కూడా కిషన్ రెడ్డి త్వరగా కరోనా నుంచి పూర్తిగా కోలుకావాలని కోరుతూ పోస్ట్ చేశారు.
Wishing you a speedy recovery @kishanreddybjp anna.
Get well soon.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 20, 2022
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన కేసులు మళ్లీ భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో తెలంగాణలో కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 3,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే..ఇంకా మరణాల విషయానికి వస్తే నిన్న కరోనాతో తెలంగాణలో ఇద్దరు మరణించగా.. ఈ రోజు మరో ముగ్గురిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,065కు చేరిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ రోజు నమోదైన 3,557 కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1474 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి జిల్లాలో 275, మేడ్చల్ జిల్లాలో 321 నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మరో 123 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్ చెబుతానన్న గుడ్‌న్యూస్ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?
హన్మకొండ, ఖమ్మం (Khammam) జిల్లాల్లోనూ కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ రోజు కొత్తగా 104 కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 130 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 77, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో 72 కేసులు నమోదయ్యాయి.ఇదిలో ఉంటే రాష్ట్రంలో తాజాగా నమోదైన 3,557 కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196కు చేరింది.
ఇవి కూడా చదవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Corona positive, Kishan Reddy