Home /News /telangana /

HYDERABAD UNION MINISTER KISHA REDDY HAS CRITICIZED CM KCR OVER CREATING HIFE FOR PADDY BUYING ISSUE IN TELANGANA PRV

Paddy buying in Telangana: ఏపీకి రాని సమస్య తెలంగాణకే ఎందుకొచ్చింది..? సీఎం కేసీఆర్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ధ్వజం

kishan reddy file pic

kishan reddy file pic

ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇంకా చదవండి ...
    ధాన్యం కొనుగోలు (Paddy buying in Telangana) అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ రగడకు దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణ (Telangana)లో ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ (CM KCR) రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వాన్ని చూస్తే జాలి వేస్తోందని కిషన్‌రెడ్డి (Union  Minister Kishan Reddy) వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి మారలేదని, రాష్ట్రంతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఎక్కడా దాటడం లేదు.. గత నెలలలో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే తెలంగాణ హాజరుకాలేదన్నారు. అంతే కాకుండా గతంలో ఇచ్చిన టార్గెట్‌ ఇంత వరకు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేయలేదని.. ఇంత వరకు FCI ఆ బియ్యం పంపలేదన్నారు. పంజాబ్‌ (Punjab)లో కొంటున్నారు అంటూ తెలియకుండా మాట్లాడుతున్నారు. పంజాబ్‌లో ఏటా ఒక్కసారి మాత్రమే ధాన్యం (Paddy) వస్తుందన్నారు.

    తెలుసుకుని మాట్లాడితే మంచిది..

    ధాన్యం కొనుగోలు (Paddy buying in Telangana) విషయంలో ఏపీకి లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందంటూ కిషన్​రెడ్డి ప్రశ్నించారు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ పండించడని, మిల్లింగ్‌లోనే అది బాయిల్డ్‌ రైస్‌గా మారుతుందన్నారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్య తెలంగాణ (Telangana)కు ఎందుకు వస్తుందన్నారు.

    అధికారం నిలబెట్టుకోవడానికి..

    రాజకీయ చదరంగంలో రైతుల్ని (farmers) బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్ (CM KCR) బలి చేస్తున్నారని విమర్శించారు. కొడుకుకు అధికారం ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల్లో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

    రేపు తెలంగాణలోనూ అధికారంలోకి..

    భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ (CM KCR) హెలికాఫ్టర్లు వేసుకొని దేశమంతా తిరుగుతున్నారని కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా  విమర్శించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచామని మంత్రి అన్నారు.

    Paddy buying: ధాన్యాన్ని ధాన్యంలా కొనాలి.. గోధుమల సేకరణ అంటే పిండి కొంటారా? కేంద్రంపై వ్యవసాయ శాఖ మంత్రి ధ్వజం

    రేపు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో పెట్రోల్ రెట్లు (Petrol rates) పెరిగితే చాలా రాష్ట్రాలు పన్నులు తగ్గించుకున్నా.. తెలంగాణ ఎందుకు తగ్గించలేదని  ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రోల్ పై 20 వేల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Kishan Reddy, Telangana bjp

    తదుపరి వార్తలు