హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajnath Singh in Hyderabad: పార్లమెంట్​లో ‘‘గోహత్య నిషేధం బిల్లు’’ను ప్రవేశపెట్టిందే కృష్ణంరాజు.. : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

Rajnath Singh in Hyderabad: పార్లమెంట్​లో ‘‘గోహత్య నిషేధం బిల్లు’’ను ప్రవేశపెట్టిందే కృష్ణంరాజు.. : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Twitter/Photo)

కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Twitter/Photo)

ఇటీవల అనారోగ్య కారణాలతో కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సంతాపసభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టాలీవుడ్​ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (Krishnam Raju) సంతాపసభను శుక్రవారం హైదరాబాద్​లో (Hyderabad) నిర్వహించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంతాప సభను (Krishnam Raju's condolence meeting) శుక్రవారం నిర్వహించారు. ఈ సంతాపసభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  (Union Home Minister Rajnath Singh))ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నేడు మధ్యాహ్నం ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణితో పాటు పిల్లలు, సినీ నటుడు ప్రభాస్ (Prabhas) ను రాజ్​నాథ్​ పరామర్శించారు. కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం సంతాపసభలో ఆయన పాల్గొన్నారు.

  అన్న అని పిలిచేవాడినని..

  కృష్ణంరాజు వివాదాలకు దూరంగా ఉండేవారని  రాజ్​నాథ్ సింగ్ అన్నారు. కృష్ణంరాజును తాను అన్న అని పిలిచేవాడినని కేంద్ర హోం మంత్రి గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ళుగా తనకు ఆత్మీయుడిగా కృష్ణంరాజు ఉన్నాడని చెప్పారు రాజ్​నాథ్​. గోహత్య నిషేధంపై Cow Slaughter Prohibition Bill) పార్లమెంట్ లో తొలిసారిగా బిల్లు ప్రవేశ పెట్టింది కృష్ణంరాజు అనే విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  హైదరాబాద్​లోని (Hyderabad) ఫిలింనగర్ సొసైటీలో దివంగత సినీనటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ (Minister Talasani Srinivasa Yadav) తెలిపారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్‌లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్ (ANR) తర్వాత విలక్షణ నటుడు కృష్ణంరాజు అని అన్నారు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరని పేర్కొన్నారు.

  కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం..

  'నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూశాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు' అని మంత్రి తలసాని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం. కృష్ణంరాజు చనిపోగానే రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్‌లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్లలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు' అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

  కృష్ణం రాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Krishnam Raju, Prabhas, Rajnath Singh

  ఉత్తమ కథలు