హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: జ్వర సర్వేపై కేంద్రం ప్రశంస.. తెలంగాణ కరోనా కట్టడి వ్యూహాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని హరీశ్​కు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వెల్లడి

Telangana: జ్వర సర్వేపై కేంద్రం ప్రశంస.. తెలంగాణ కరోనా కట్టడి వ్యూహాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని హరీశ్​కు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వెల్లడి

తెలంగాణలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు హరీశ్​ రావు వివరించారు. తెలంగాణలో జ్వర సర్వేపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు.

తెలంగాణలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు హరీశ్​ రావు వివరించారు. తెలంగాణలో జ్వర సర్వేపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు.

తెలంగాణలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు హరీశ్​ రావు వివరించారు. తెలంగాణలో జ్వర సర్వేపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు.

    తెలంగాణ (Telangana)లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ (Minister harish Rao) రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే (Fever Survey), వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు వివరించారు. తెలంగాణలో జ్వర సర్వేపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ (Union Health Minister Mansuk Mandaviya) ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి మంచి వ్యూహాన్ని అనుసరిస్తుందని అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు విధాన రూపకల్పన చేస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

    ఈసీఅర్పీ-2 కింద తెలంగాణకు రావాల్సిన రెండో దశ పెండింగ్ నిధులు విడుదల చేయాలని హరీశ్​ (Harish) కేంద్రాన్ని కోరారు. పిడియాట్రిక్ ఐసీయూలకు ఎస్ఎన్సీయూ తరహాలో అవసరమైన మానవ వనరులను సమకూర్చాలని, కేంద్రం సరఫరా చేసిన వెంటిలేటర్స్ ని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన హ్యుమిడిఫయర్లను కూడా సరఫరా చేయాలని కోరారు.

    దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 60 ఏళ్ల వయసు పై బడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్ (Minister Harish rao) రావు మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ రెండు డోసుల గడువును తగ్గించాలని, అలాగే రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని అన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ డోస్ (Booster Dose) ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

    తెలంగాణలో కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు..

    రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​ ఆదేశాలతో తెలంగాణలో కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సిద్ధం చేశామని హరీశ్​ కేంద్రానికి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 77,33,427 ఇళ్లలో జ్వర సర్వే చేశామన్నారు. 3,45,951 కిట్లను అందించామన్నారు .రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని మంత్రి హరీశ్ రావు వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరోసారి జ్వర సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం 21,150 బృందాలు జ్వర సర్వే చేస్తున్నాయన్నారు.

    ఆరోగ్య, పంచాయతీ లేదా మున్సిపల్ విభాగాల నుంచి ఒక్కో బృందంలో ముగ్గురు ఉంటారని, వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. లక్షణాలు ఉన్నవారికి అక్కడే హోమ్ ఐసొలేషన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. మరో వారం తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తారని తెలిపారు. అవసరం అయితే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

    జ్వర సర్వేతో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందని, దీని వల్ల పాజిటివిటీ రేటు తగ్గి, హాస్పిటలైజేషన్ తగ్గిందని చెప్పారు. లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వం ఇస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్లు వినియోగించడం వల్ల మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నట్లు చెప్పారు. మరో వైపు కోవిడ్ ఓపీ సేవలను సబ్ సెంటర్, పీహెచ్సీ, బస్తీ దవాఖానల నుంచి జిల్లా, టీచింగ్ ఆసుపత్రుల వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 27 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

    First published:

    Tags: Central governmennt, Fever, Health minister, Minister harishrao, Telangana health department, Union government

    ఉత్తమ కథలు