హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా కేసు (Hyderabad drug supply case)
లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ (Edvin) ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 3 మాసాల పాటు గోవాలో మకాం వేసిన హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఎడ్విన్ ను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అనంతరం అక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకున్న పోలీసులు ఎడ్విన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక తాజాగా ఈ కేసులో మరో నిందితుడు బాలమురగన్ (Bala murugan) ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. ఎవరికీ తెలియకుండా వ్యాపారం చేస్తున్న బాలమురుగన్ ను ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో గోవాలో నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలమురుగన్ రాజస్థాన్ , హిమాచల్ ప్రదేశ్ , గోవా, తమిళనాడు , కేరళ రాష్ట్రాలకు బాల మురుగన్ (Bala murugan) డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడు.
ఎడ్విన్ తో 15 ఏళ్లుగా సంబంధం..
ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎడ్విన్ (Edwin) తో బాలమురుగన్ కు 15 ఏళ్ల నుండి సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయంతో వారు డ్రగ్స్ సరఫరా కొనసాగిస్తున్నారు. మురుగన్ హోటల్ బిజినెస్ పేరుతో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. అతని నుండి డ్రగ్స్ కొనుగోలు చేయడానికి 2 వేల ముంది కస్టమర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతోనే బాలమురుగన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైద్రాబాద్ (Hyderabad) కు తీసుకొచ్చారు.
ఎడ్విన్ కు బెయిల్..
డ్రగ్స్ సరఫరా కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ (Edwin) కు బెయిల్ లభించింది. దీనితో చంచల్ గూడ జైలు నుంచి ఎడ్విన్ (Edwin) విడుదల అయ్యాడు. అయితే పీడీయాక్ట్ (Pd Act) ను ప్రయోగిద్దాం అనుకునే సమయానికే ఎడ్విన్ (Edwin) కు బెయిల్ లభించినట్లు తెలుస్తుంది. కాగా కొన్ని నెలల నుంచి ఎడ్విన్ (Edwin) పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే నారాయణ బోర్కర్ (Narayana Borker) ఇచ్చిన సమాచారంతో 3 నెలలు గోవాలో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే పట్టుమని 10 రోజులు కాకుండానే ఎడ్విన్ (Edwin) కు బెయిల్ లభించడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Telangana, Telangana News