హోమ్ /వార్తలు /తెలంగాణ /

Missing: కూకట్‌పల్లిలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్.. ఇద్దరు ఫ్రెండ్స్.. !

Missing: కూకట్‌పల్లిలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్.. ఇద్దరు ఫ్రెండ్స్.. !

అమ్మాయిలు మిస్సింగ్!

అమ్మాయిలు మిస్సింగ్!

ఆసుపత్రిలో నర్సుగా పని చేసే జ్యోతి, కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బి.కాం చదువుతున్న లిఖిత రమ్య అనే ఇద్దరి అదృశ్యమయ్యారు. ఇంటర్ చదువుతున్న సమయం నుండి జ్యోతి, రమ్యలు స్నేహితులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో అమ్మాయిల వరుస మిస్సింగ్‌లు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే సికింద్రబాద్‌లో కూడా అమ్మాయిలు వరుసగా మిస్సింగ్ అయ్యారు. బాలికలు యువతులు కనపించకుండా పోతున్నారు. అయితే తాజాగా సిటీలోని కూకట్ పల్లిలో ఇద్దరు యువతులు అదృశ్యం అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోయారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధులలో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది.

కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే జ్యోతి, కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బి.కాం చదువుతున్న లిఖిత రమ్య అనే ఇద్దరి అదృశ్యమయ్యారు. ఇంటర్ చదువుతున్న సమయం నుండి జ్యోతి, రమ్యలు స్నేహితులు. దీంతో ఇద్దరి కోసం కుటుంబ సభ్యులు అంతటా గాలించారు. తెలిసిన వారివద్ద, బంధువుల వద్ద వెతికినా అచూకీ దొరకకపోవడంతో.. పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.

అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారు, ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఇంట్లో వాళ్లతో వీరిద్దరి సంబంధాలు ఎలా ఉన్నాయి ఇలా చాలా విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా జ్యోతి పనిచేసే ఆస్పత్రిలో కూడా పలువురిని ప్రశ్నించనున్నారు. అటు రమ్య చదువుతున్న కాలేజీలో కూడా ఆమె స్నేహితులు, క్లాస్ మేట్స్‌ను విచారించే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు వారి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఎక్కడికిపోయారు... ఏమైపోయారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Local News, Missing cases, Women missing

ఉత్తమ కథలు