ఈమధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలను ట్రాన్స్‌జెండర్స్ transgendersదక్కించుకోవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. దేశ వ్యాప్తంగా చూసుకుంటే గతంలో పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో కీలక స్థాయి ఉద్యోగులుగా ట్రాన్స్‌జెండర్స్ చేరారు. తాజాగా తెలంగాణ(Telangana)లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్ డాక్టర్లు(Doctors)కాంట్రాక్ట్ విధానంలో నియమితులవడం గొప్ప అంశంగా చూడాలి. లింగ మార్పిడి చేసుకున్న ప్రాచీ రాథోడ్(Prachi Rathode), కొయ్యల రుత్‌జాన్‌పాల్(Koyala Ruth Janpal)అనే ఇద్దరూ డాక్టర్లు మెడికల్ ఆఫిసర్లుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్(Osmania General Hospital)లో విధులు నిర్వహిస్తున్నారు.
డాక్టర్లుగా ట్రాన్స్‌జెండర్స్ ..
లింగమార్పిడి చేసుకున్న వాళ్లంటే సమాజంలో అందరూ చులకనగా చూస్తుంటారు. కాని వాళ్లలో కూడా తమ ప్రతిభ, పట్టుదలతో ఉన్నత స్థాయి వ్యక్తులగా ఎదగడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరుకోవడం అరుదుగా జరుగుతుంది. కాని తెలంగాణలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రాచి రాథోడ్, రుత్ జాన్‌పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న ప్రాచి రాథోడ్ ప్రభుత్వ ఉద్యోగం రాక ముందు తాము పడిన ఇబ్బందులు, తమ పట్ల చూపించిన వివక్షను అందరితో షేర్ చేసుకున్నారు.
వైద్యశాఖ చరిత్రలో రికార్డ్ ..
మెడిసిన్ అయిన తర్వాత తాను ట్రాన్స్‌జెండర్ అని తెలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్ తనను ఉద్యోగం మానేసి వెళ్లిపోవాలని కోరినట్లుగా తెలిపారు. తనను చూసి పేషెంట్లు హాస్పిటల్‌కు వచ్చేందుకు వెనుకాడుతున్నారని అందుకే జాబ్ రిజైన్ చేయాలని కోరినట్లుగా ప్రాచి రాథోడ్ తెలిపారు. 30ఏళ్ల వయసులో డాక్టర్ వృత్తిని ఎంచుకుంటే ఇంతలా అవమానించారని చెప్పుకొచ్చారు. వైద్య వృత్తిలోకి వచ్చినందుకు రోగులు తమను వివక్షతో చూసినప్పటికి మేం మాత్రం రోగులకు తగిన వైద్య సేవలందించి వారి మన్ననలు పొందుతామన్నారు ప్రాచి రాథోడ్.
ఫస్ట్ టైమ్ ..
ఖమ్మం పట్టణానికి చెందిన మరో ట్రాన్స్డెంజర్ రుత్ జాన్‌పాల్. 2018లోనే మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. మెడిసిన్ పూర్తైన తర్వాత జాబ్ కోసం ఎన్నో హాస్పిటల్స్‌కి వెళ్లానని కాని ట్రాన్స్‌జెండర్ అనే ఒక్క కారణంతో తనకు ఉద్యోగం ఇవ్వలేదని తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నో అవమానాలు, ఆటుపోటులను ఎదుర్కొని నీట్ పీజీ ఎంట్రెన్స్ రాసి ట్రాన్స్‌జెండర్ కేటగిరిలో తమకు రిజర్వేషన్ కల్పించలేదంటున్నారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్దమేనన్నారు ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్ వైద్య ఉద్యోగులు. తమకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫిసర్లుగా పోస్టింగ్ రావడం ట్రాన్స్జెండర్లకు ఓ గర్వ కారణమైన రోజుగా భావిస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana News, Transgender