హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Murder: ఆ మర్డర్​ వెల రూ.160.. హైదరాబాద్​లో సంచలనంగా రోడ్డుపై హత్య 

Hyderabad Murder: ఆ మర్డర్​ వెల రూ.160.. హైదరాబాద్​లో సంచలనంగా రోడ్డుపై హత్య 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​లో రెండు రోజుల కిందట జరిగిన ఓ మర్డర్​ సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ మర్డర్​ చేసింది ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ హత్య జరిగింది 160 రూపాయల కోసమే..

  హైదరాబాద్ (Hyderabad)​లో రెండు రోజుల కిందట జరిగిన ఓ మర్డర్​  (Hyderabad Murder) సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ మర్డర్​ చేసింది ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ హత్య జరిగింది 160 రూపాయల కోసమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం మరో ట్విస్టు. మధ్య మండలం డీసీపీ రాజేంద్ర చంద్ర, అడిషనల్ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంగళవారం దీనికి  (Hyderabad Murder) సంబంధించిన వివరాలను వెల్లడించారు. జహీరాబాద్, రామ్‌నగర్‌కు చెందిన బోయిన మహేష్‌ కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా, డంజార్గావ్‌కు చెందిన జె.అనిల్‌కుమార్‌ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అడ్డా కూలీలుగా పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై నివాసం ఉండేవారు.

  24న లక్డీకాపూల్​లో..

  మహేష్​, అనిల్​ అప్పుడప్పుడు ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు లాక్కుని జల్సా చేసేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న లక్డీకాపూల్‌ బస్టాపు వద్ద నిద్రిస్తున్న ఓ యాచకుడిని టార్గెట్‌ చేసుకున్న వారు కత్తితో గొంతు కోసి జేబులో ఉన్న రూ.160 నగదును తీసుకుని పారిపోయారు. అయితే రక్తం మడుగులో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైఫాబాద్​ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మృతి చెందాడు.

  సీసీ కెమెరాల పుటేజీల సాయంతో..

  కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బోయిన మహేష్, జె.అనిల్‌ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. నాంపల్లి, బజార్‌ఘాట్‌లోని కాలభైరవ దేవాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య, ఎస్సై మాధవి, కానిస్టేబుళ్లు అజీముద్దీన్, అహ్మద్‌ షా ఖాద్రీలను డీసీపీ అభినందించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు నగదు రివార్డులను అందజేశారు.

  రూ. వెయ్యి కోసం..

  మెదక్ Medakజిల్లాలో రెండు నెలల కిందటే ఇలాంటి దారుణ ఘటనే ఒకటి జరిగింది. జిల్లాలోని నర్సాపూర్(Narsapur)నియోజకవర్గం కౌడిపల్లి(Koudipalli)మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో మే నెల 4వ తేదీన గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లుగా తెలుసుకున్న కౌడిపల్లి పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌(Dundigal Police Station‌)లో నమోదైన మిస్సింగ్‌ కేసు(Missing‌ case)లోని వ్యక్తే మృతుడిగా నిర్ధారించారు. మృతుడు చిలిపిచెడు మండలం లచ్చి తాండాకు చెందిన మాలోత్ సురేష్ (Maloth Suresh)30గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) ఘటన స్తలంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొర్ర శ్రీనివాస్‌(Korra Srinivas)అనే వ్యక్తిని పిలిచి ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. అక్కడే అసలు నిజం కక్కించారు.

  పోలీసులు అనుమానించిన వ్యక్తి కొర్ర శ్రీనివాసే సురేష్‌ని చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. హత్య చేయడానికి గల కారణాలు చెప్పినప్పుడు పోలీసులు ఆశ్చర్యపోయారు. రెండు నెలల క్రితం సురేష్‌ శ్రీనివాస్ దగ్గర వెయ్యి రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించమని పదే పదే అడుగుతున్న ఇవ్వడం లేదనే కోపంతో ఓ పథకం ప్రకారం హత్య చేసినట్లు చెప్పాడు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Murder

  ఉత్తమ కథలు