Same gender marriage :స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద స్వలింగ సంపర్కుల వివాహాన్ని(Same gender marriage)గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ లో నివసించే అభయ్ దాంగ్, సుప్రియో చక్రవర్తి అనే ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్(PIL)పై నేడు విచారణ జరుగనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వీరి పిల్ పై నేడు విచారణ చేపట్టనుంది. పిటిషనర్లు సుప్రియో చక్రవర్తి- అభయ్ డాంగ్ దాదాపు 10 సంవత్సరాలుగా జంటగా ఉన్నారు. వీరి కుటుంబసభ్యులు కూడా వీరికి మద్దతుగా నిలిచారు. కాగా, కోవిడ్ రెండవ వేవ్ సమయంలో వారిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారు కోలుకున్న తర్వాత, వారి 9వ వార్షికోత్సవం సందర్భంగా తమ ప్రియమైన వారితో తమ సంబంధాన్ని జరుపుకోవడానికి వివాహ-కమిట్మెంట్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు డిసెంబర్ 2021లో కమిట్మెంట్ వేడుకను నిర్వహించగా వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు వారి సంబంధాన్ని ఆశీర్వదించారు.
ప్రత్యేక వివాహ చట్టం స్వలింగ జంటల మధ్య వివక్ష చూపేంత వరకు ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమని, వ్యతిరేక లింగ జంటలు స్వలింగ జంటలకు చట్టపరమైన హక్కులు, సామాజిక హక్కులను నిరాకరించినట్లు పిటిషనర్లు తమ పిల్ లో తెలిపారు.
కులాంతర, మతాంతర జంటలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును భారత సర్వోన్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ పరిరక్షించిందని,స్వలింగ వివాహాలు ఈ రాజ్యాంగ యాత్రకు కొనసాగింపు అని తెలిపారు. నవతేజ్ సింగ్ జోహార్, పుట్టస్వామి కేసుల్లో సుప్రీంకోర్టు.. ఇతర వ్యక్తులలాగే LGBTQ+ వ్యక్తులు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, గోప్యత హక్కును అదే ప్రాతిపదికన అనుభవించాలని పేర్కొంది. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు LGBTQ+ పౌరులకు కూడా విస్తరించాలని పిటిషనర్లు ఇప్పుడు వాదిస్తున్నారు.
Rahul Gandhi: మహిళా ఎమ్మెల్యేకు ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్
కాగా,ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం కింద స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టులో ప్రస్తుతం 9 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ అన్ని రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోందని కేరళ హైకోర్టు ముందు ఒక ప్రకటన చేశారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Supreme Court