HYDERABAD TWO LAKHS INSURANCE FOR CONGRESS ACTIVIST WHO TAKES MEBERSHIP VRY
Revanth reddy : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రెండు లక్షల జీవిత బీమా ఎందుకంటే..
revanth reddy
Revanth reddy : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు.పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే డిజిటల్ సభ్యత్వ నమోదును ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించనుంది. ఈ క్రమంలోనే గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియా ఇన్స్యూరెన్స్ కంపనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు మరణిస్తే రెండు లక్షల రూపాయల ప్రమాదబీమా వర్తిస్తోంది. ఇతర అవయవాలు కోల్పోయినా భీమా వర్తించనున్నట్టు తెలిపారు.
ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. దాదాపు ముప్పై లక్షల సభ్యత్వ నమోదును చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మరోవైపు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డును సైతం ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలకు భరోసా కోసమే ఈ జీవిత బీమా సౌకర్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా ఈకార్యక్రమంలోనే పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గోన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.