New Covid Variant : తెలంగాణలో కొత్త వేరియంట్ కేసులు..! కరోనా మూడో వేవ్ పై ఊపందుకున్న ఊహాగానాలు.. దానికి కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

Delta Strain: బ్రిటన్‌లో వేగంగా కేసులు పెరగడానికి కారణమైన ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ తెలంగాణలో వెలుగులోకి రావడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీనితో ఎక్కువగా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని.. మరణాల సంఖ్య విపరీతంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 • Share this:
   తెలంగాణ(Telangana)లో కరోనా(Corona cases in Telangana) కేసులు తగ్గి.. అందరూ వ్యాక్సిన్ (Covid 19 Vaccine) తీసుకొని ఇప్పడిప్పుడే తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ లోపే ఈ వార్త కాస్త ఆందోళనకరంగా మారింది. ఇటీవల బ్రిటన్ (Britain)లో కరోనా ఉదృతికి కారణమైన ‘ఏవై.4.2’ వేరియంట్ (New Delta Variant AY4.2) కేసులు అటు కర్ణాటకలో ఇటు  తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఇద్దరిలో ఈ తరహా వైరస్‌ కనిపించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఇన్‌ షేరింగ్‌ ఆఫ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది. ఈ వేరియంట్ కు గురైన వారిలో ప్రపంచవ్యాప్తంగా 26 వేల మంది ఉన్నారు. ఈ వేరియంట్ కారణంగానే మనదేశంలో మూడో వేవ్ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..


  నిమ్స్‌ నుంచి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వచ్చిన నమూనాల్లో ఈమేరకు వేరియంట్ గుర్తించినట్లు చెప్పారు. తెలంగాణలో గత నెలలో నమోదైన 274 మంది కరోనా కేసుల్లో వాటి రక్త నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ లేబరేటరీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అందులో ఇద్దరి నమూనాల్లో ‘ఏవై.4.2’ కరోనా వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించారు వైద్యశాఖ అధికారులు. అందులో 48 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉండగా.. మరొకరు 22 ఏళ్ల యువతికి సోకినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ రావడానికి ముఖ్య కారణంగా చెప్పుకునే డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. దాని వల్లే తెలంగాణలో లక్షలాది మంది కరోనా బాధితులు అయ్యారు. వేలమంది జీవితాలు మట్టిలో కలిసి పోయాయి.

  Uses Of Ladyfinger: బెండకాయ వంటలకే కాదు.. ఔషద పరంగా కూడా ఎంతో ఉపయోగకరం.. ఏ వ్యాధులకు ఉపయోగిస్తారంటే..


  అంతేకాకుండా వివిధ రకాల స్ట్రెయిన్లు కూడా గర్తించపడ్డాయి. ఇలా గుర్తించిబడిన వాటిలో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో రెండు అదనపు మ్యుటేషన్లు కూడా ఉన్నాయి. ఏ222వీ, వై145హెచ్‌ అనే ఈ మ్యుటేషన్లు ఉండటమే దీనికి, డెల్టా వేరియంట్‌కు ప్రధానమైన తేడా. ఈ ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ వైరస్‌తో పోలిస్తే, 12.4 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మరణించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయని యూకే చెబుతుండగా, డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం కేసులు పెరుగుతున్నాయే కానీ, మరణాలు పెద్దగా లేవని చెబుతుండటం కొంత ఊరటనిస్తోంది.

  Delta AY.4.2: బెంగళూరులో కొత్త రకం కరోనా కలకలం... Delta AY.4.2తో భయంభయం..


  అయితే దీనిని మొదట మనదేశంలో జూలైలోనే గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ పెద్దగా వ్యాప్తి చెందకపోవడంతో వెలుగులోకి రాలేదన్నారు. తెలంగాణలో ఆ వేరియంట్ కేసులు ప్రస్తుతం రెండు ఉండగా.. ఆ కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చనేది చర్చనీయాశంగా మారింది. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని.. నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: