Hyderabad: కరెంట్ షాక్...సాధారణ ఇంటికి రూ.25 లక్షల బిల్లు

మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.

news18-telugu
Updated: July 6, 2020, 10:22 PM IST
Hyderabad: కరెంట్ షాక్...సాధారణ ఇంటికి రూ.25 లక్షల బిల్లు
సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు..
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలకు విద్యుత్ బిల్లులు ఇప్పుడు మరింత భారంగా మారాయి. వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో.. వేలల్లో వచ్చే వారికి లక్షల్లో బిల్లులొస్తున్నాయి. ఐతే విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిన రోజే.. మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఓ వినియోగదారుడికి ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె ఆగినంత పనయింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు కూడా షాక్ తిన్నారు.

హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో నివాసముండే ఓ వ్యక్తికి సాధారణంగా నెలకు రూ. 500-600 కరెంట్ బిల్లు వస్తుంది. ఇక వేసవిలో అయితే రూ.800 వరకు వస్తుంది. ఐతే లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలు బిల్లు తీయలేదు. అన్నీ కలిపి సోమవారం బిల్లు ఇచ్చారు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు. సదరు వినియోగదారుడి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని చెప్పారు. మీటర్‌ను టెస్టింగ్‌ కోసం పంపించారు.

కాగా, తెలంగాణలో విద్యుత్ బిల్లులకు నిరసనగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. అటు రాష్ట్రవ్యాప్తంగానూ విద్యుత్ కార్యాలయాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్లాబుల రేట్లను పెంచి భారీగా బిల్లులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం వేసి.. మరింత ఇబ్బందుల్లోకి నెట్టారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading