Home /News /telangana /

HYDERABAD TSRTC REQUEST TO HIKE CHARGES IN APSRTC BECAUSE FULL RUSH IN ANDHRA PRADESH BUSES NGS

APSRTC: ఛార్జీలు పెంచండి బాబు అంటూ ఆంధ్రాకు.. తెలంగాణ రిక్వెస్ట్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

APSRTC: రాష్ట్ర విడిపోయిన తరువాత.. ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం.. స్నేహపూర్వకంగానే ఉంటున్నాయి. విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. అయితే తాజాగా ఇప్పుడు ఓ విషయం వైరల్ అవుతోంది.. ఏపీలో ఛార్జీలు పెంచమని తెలంగాణ విన్నపాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    APSRTC: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడో విషయం హాట్ టాపిక్ అయ్యింది. అదే బస్సు ఛార్జీల పెంపు (Rtc Bus Charges Hike) .. ఇంతకీ విషయం ఏంటంటే..? ప్రయాణం చేయడానికి సామాన్యులు, పేద, మధ్యతరగతివారు ఎంచుకునే వాహనం ఆర్టీసీ బస్సు (RTC bus) అనడంలో ఎలాంటి సందేహం లేదు. పల్లెకు, పట్టణానానికి ప్రజలను సురక్షితంగా చేరవేసే ఆర్టీసీలో ప్రయాణం చాలా సురక్షితం అని ఆర్టీసీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేస్తారు. తెలంగాణ (Telangana) లో గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తోన్న ఆర్టీసీని మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు.. కరోనా రక్కసి.. మరింత ఇబ్బందుల్లోకి తోసేసింది. ఇక రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ (Petrol, diesel) ధరలు కూడా ఆర్టీసీ నష్టాలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ (Tsrctc) తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొత్త కొత్త స్కీమ్ లు పెడుతోంది.. సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. అయినా నష్టాల బాట వీడడం లేదు. ప్రజలను ఆకర్షించి.. ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకుని వెళ్లే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. అవన్నీ అదనపు హంగులే తప్పా.. ఆదాయం పెంచే మార్గాలుగా మారడం లేదు. దీంతో ఆర్టీసీ సంస్థపై భారం తగ్గే విధంగా ఇటీవల కొంతమేర బస్సు చార్జీలను పెంచింది. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) కి లాభం చేకూర్చిందని తాజా లెక్కలు చెబుతున్నాయి.

    సాధరణంగా ఏపీఎస్ఆర్టీ బస్సు సేవలు తెలంగాణ నుంచి భారీగానే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలను కవర్ చేస్తూ ఏపీకి చేరుకుంటాయి. ఇక ఏపీలో వివిధ జిల్లాల నుంచి హైదారాబాద్ కు వెళ్లేవారు.. వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇటు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ రెండు సర్వీసులు రద్దీగానే ఉంటాయి. అయితే ఇటీవల తెలంగాణ ఆర్టీసీ సర్వీసు చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు ఏపీ ఆర్టీసీ బస్సులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వివిధ ప్రాంతాల బస్సుల్లో ఏపీ బస్సులనే ప్రయాణికులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ఆర్టీసీ ఆదాయం పెరిగి.. తెలంగాణలో ఆదాయం తగ్గుతోంది.



    గత నాలుగు ఐదు రోజుల్లోనే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు ఫుల్ అవుతున్నాయని.. దీంతో అక్కడ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఏం చేయోలో అన్నది తెలంగాణ అధికారులకు అంతుచిక్కడం లేదు. ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్‌ ఆర్టీసీని కోరింది.

    ఇదీ చదవండి : చంద్రబాబుకు ఎమ్మెల్యే అభినందనలు.. కాదంటూ మంత్రి విమర్శ.. ఒకే వేదికపై ఇద్దరూ ఇలా?

    రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఇరురాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల చార్జీలు ఒకేలా ఉండాలని.. కనుక ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ తన బస్సుల చార్జీలు పెంచాలని కోరింది. మరి దీనిపై ఏపీ ఎస్ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Telangana, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు