హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..ఇంతకీ సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?

Telangana: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..ఇంతకీ సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?

TSRTC ఎండీ సజ్జనార్ (PC: Twitter)

TSRTC ఎండీ సజ్జనార్ (PC: Twitter)

రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక మొన్న కేటీఆర్, నిన్న ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కు గురి కాగా తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఇంతకీ ఆ హ్యాకర్లు ఏం చేశారో తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSRTC MD sajjanar twitter account hacked |  రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక మొన్న కేటీఆర్, నిన్న ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కు గురి కాగా తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ట్విట్టర్ అకౌంట్ (Twitter Account Hacked) ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఇంతకీ ఆ హ్యాకర్లు ఏం చేశారో తెలుసా?

Medchal Fire: మేడ్చల్‌లో అర్థరాత్రి కాల్పల కలకలం..మద్యం షాపు వద్ద బీభత్సం.. !

ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ (Sajjanar) ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. అనంతరం ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చి డీపీగా కోతి బొమ్మను పెట్టారు. అలాగే ట్విట్టర్ లో సంబంధం లేని వింత పోస్టులు కూడా పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఈ విషయాన్ని ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ట్విట్టర్ సపోర్ట్ టీంకు ఫిర్యాదు చేయగా వారు ఖాతాను పునరుద్దరించడం కూడా జరిగిపోయింది. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Indian Idol: హైదరాబాద్ లో తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఆడిషన్స్.. ఎక్కడంటే..!

అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్  కావడంపై టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్  (Twitter Account Hacked) కు గురి కావడం బాధాకరం. ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి హ్యాండిల్ లో సంబంధం లేని పోస్టులు పెట్టారు. @tsrtcmdooffice ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైనట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని తెలుస్తుంది. ట్విట్టర్ సపోర్ట్ టీం సమయానికి స్పందించి ఖాతా పునరుద్దరించడంతో ట్విట్టర్ అకౌంట్  (Twitter Account) యథావిధిగా పని చేస్తుంది.

ఇక ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ (Sajjanar) తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పరుగులు పెట్టించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పండుగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా వినూత్న ఆఫర్లు ప్రకటించి ఆర్టీసీని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ (Sajjanar) ప్రయాణికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

First published:

Tags: Hackers, Sajjanar, Telangana, Twitter

ఉత్తమ కథలు