TSRTC MD V.C Sajjanar: దేశం మొత్తం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు వంటనూనె, గ్యాస్ ధరలు ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. వీటితో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ ట్వీట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశం(Country)మొత్తం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిజిల్, పెట్రోల్(Petrol) ధరలతో పాటు వంటనూనె, గ్యాస్ ధరలు ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. వీటితో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. పెరుగుగుతన్న ధరలు చుక్కలు చూపిస్తుండటంతో పల్లెటూర్లో ఉండే వాళ్లు గ్యాస్ లను ఉపయోగించడం కూడా మానేశారు. దీనిలో ఎక్కువగా పెట్రోల్ ధరలపై ఎక్కువగా నిరసన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. మధ్య తరగతికి చెందిన వాళ్లు ఎక్కువగా ద్విచక్ర వాహనాలను కలిగి ఉంటాడు. అతడు ఎక్కడకు వెళ్లాలన్నా ఆ వాహనాన్నే ఉపయోగిస్తాడు.. ఇలా రోజు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సొంత వాహనాలను ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది.
ఇప్పటికే పెట్రోల్ ధర లీటరు రూ.114 కు చేరుకుంది. గత రెండు నెలల్లోనే 50 శాతానికి పైగా పెరిగింది. ఇలా పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో చాలామంది సొంతవాహనాలను కాకుండా..ప్రైవేట్ వాహనాలను ఉపయోగించి తమ విధులకు హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. సిటీలో చాలా మంది బైకుల కంటే సిటీ బస్సులు, మెట్రో ట్రైన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. బైకులు, కార్లు కంటే ఎలక్టికల్ బండ్లు, సైకిళ్లు బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు ప్రజలు. వాటికి సంబంధించిన మీమ్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
అయితే వీటిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సస్జనార్ కూడా తనదైన శైలిలో స్పందించారు. అతడు మీమ్స్ రూపంలో తన నిరసనను వ్యక్తం చేశాడు. పెరుగుతున్న పెట్రల్ ధర పై సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ మీమ్ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ పోస్టు తెగా వైరల్ అయింది.
ఈ పోస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు బైక్ నడుపుతున్న ఫొటోలతో ఉప్పల్, జీడిమెట్ల, ఆరాంఘర్ .. తూ దీనెమ్మ జీవితం ట్యాంకులు, ట్యాంకులు పెట్రోల్ అయిపోతుంది సిటీలో తిరుగుదామంటే.. అందుకే బ్రదర్ లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధరకే టీఎస్ ఆర్టీసీ వారి టీఎస్24 టిక్కెట్ తో 24 గంటలు సిటీ అంతా తిరుగు.. అంటూ రాసి ఉన్న ఓ మీమ్ ఫోటోను షేర్ చేశారు సజ్జనార్. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సొంత వాహనాలను కాకుండా ఇలా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం మంచిందంటూ అతడు పరోక్షంగా తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.