TSRTC Festival Offer: దసరా పండుగ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

TSRTC Festival Offer: భారతదేశంలో హిందూ మతం యొక్క ప్రత్యేక పండుగలలో దసరా లేదా విజయదశమి పండుగ ఒకటి అనేది అందరికీ బాగా తెలుసు. దీనిని తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీని కంటే ముందు తెలంగాణలో ఎక్కువగా నడుపుకునే పండుగ బతుకమ్మ. దీనిని ప్రతీ ఒక్కరూ పూలను అలంకరించి 9వ రోజు నీళ్లలో వేస్తారు. అయితే దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. అదేంటంటే..

  • Share this:
    భారతదేశంలో హిందూ మతం యొక్క ప్రత్యేక పండుగలలో దసరా లేదా విజయదశమి పండుగ ఒకటి అనేది అందరికీ బాగా తెలుసు. దీనిని తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీని కంటే ముందు తెలంగాణలో ఎక్కువగా నడుపుకునే పండుగ బతుకమ్మ. దీనిని ప్రతీ ఒక్కరూ పూలను అలంకరించి 9వ రోజు నీళ్లలో వేస్తారు. అయితే దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. అదేంటంటే.. దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు గానూ.. టీఎస్‌ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    Telangana: అక్కాతమ్ముడి ప్రేమ.. మామిడితోటకు వెళ్లి వస్తామని చెప్పి.. చివరకు..


    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.దీనికి సంబంధించి ప్రతీ ఏర్పాటును పూర్తి చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి అదనంగా 50 శాతం రుసుమును వసూలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
    దసరా పండుగకు మొత్తం 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కవగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి 3200 బస్సులు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి 1200 బస్సులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు నడపనున్నాయి. ఇవికాకుండా మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు.

    So Sad: ఈ ఘటన వింటే నిజంగా మానవత్వం బతికే ఉంది అనిపిస్తుంది.. అమ్మ కోసం ఆ కూతురు చేసిన త్యాగం..


    ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో పండగకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కరీంనగర్‌,ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్‌, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి బయలు దేరనున్నాయి.

    Photos-Videos: మహిళలను ఆ ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే.. వివరాలిలా..


    వరంగల్ కు వెళ్లే వారు ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా ఖమ్మం, విజయవాడకు వెళ్లే బస్సులు.. ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ నుంచి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి బయలుదేరతాయిని అధికారులు తెలిపారు. ఇవి కూడా ముందుగా ఎంజీబీఎస్ నుంచి వస్తాయన్నారు. అదే విధంగా, వైఎస్సార్‌ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్‌ నుంచి బయలుదేరతాయని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.

    పండగ యొక్క ప్రత్యేకత..
    భారతదేశంలో హిందూ మతం యొక్క ప్రత్యేక పండుగలలో దసరా లేదా విజయదశమి పండుగ ఒకటి అనేది అందరికీ బాగా తెలుసు. దీనిని తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీని కంటే ముందు తెలంగాణలో ఎక్కువగా నడుపుకునే పండుగ బతుకమ్మ. దీనిని ప్రతీ ఒక్కరూ పూలను అలంకరించి 9వ రోజు నీళ్లలో వేస్తారు. ప్రతీ రోజు తీరొక్కపూలతో పూజించి..చివరకు నీళ్లలో పూలను వేస్తారు.
    పండుక యొక్క ప్రత్యేకత ఏంటంటే.. ఇది రావణుడిపై శ్రీ రాముడి విజయం మరియు అన్యాయంపై న్యాయం చేసే పండుగగా చెబుతుంటారు.
    Published by:Veera Babu
    First published: